India Cricket Team: జట్టు నుంచి బుమ్రా విడుదల ప్రకటించిన బీసీసీఐ
ABN , Publish Date - Aug 02 , 2025 | 03:54 AM
పేస్ దళపతి జస్ర్పీత్ బుమ్రాను జాతీయ జట్టునుంచి విడుదలజేశారు. ముందు ప్రకటించినట్టుగా ఇంగ్లండ్‌తో

లండన్/న్యూఢిల్లీ: పేస్ దళపతి జస్ర్పీత్ బుమ్రాను జాతీయ జట్టునుంచి విడుదలజేశారు. ముందు ప్రకటించినట్టుగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీ్‌సలో మూడు మ్యాచ్‌లను బుమ్రా ఆడేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ శుక్రవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో బుమ్రా ఆడే తదుపరి అంతర్జాతీయ సిరీస్ ఏదనే చర్చ మొదలైంది. 31 ఏళ్ల బుమ్రా ఇంగ్లండ్‌తో 3 టెస్ట్‌ల్లో 119.4 ఓవర్లు వేసి 14 వికెట్లు సాధించాడు. ‘సిరీస్‌లో ఐదో టెస్ట్‌కు జట్టు నుంచి బుమ్రాను విడుదలజేశాం’ అని బీసీసీఐ ఆ ప్రకటనలో తెలిపింది. సిరీస్‌లో ఒకటి, మూడవ టెస్ట్‌లలో బుమ్రా ఐదేసి వికెట్లు తీశాడు. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 100 పరుగులకుపైగా సమర్పించుకున్నాడు. కెరీర్‌లో బుమ్రా ఇంత భారీగా పరుగులు ఇవ్వడం అదే మొదటిసారి కావడం గమనార్హం.
ఆసియా కప్‌లో ఆడేనా?: భారత్ ఆడే తర్వాతి సిరీస్ ఆసియా కప్. ఈ టోర్నీ సెప్టెంబరు 9 నుంచి దుబాయ్‌లో జరగనుంది. అయితే ఆసియా కప్ ముగిసిన వారానికే వెస్టిండీస్‌తో భారత్ టెస్ట్ సిరీ్‌స ఆడాలి. దాంతో ఆసియా కప్ నుంచి బుమ్రా వైదొలిగినా ఆశ్చర్యం లేదంటున్నారు.