Bangladesh vs Zimbabwe Test: ఆధిక్యంలో బంగ్లా
ABN , Publish Date - Apr 23 , 2025 | 01:15 AM
జింబాబ్వేతో టెస్ట్‌లో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో పోరాడుతోంది. నజ్ముల్ షంటో అర్ధశతకంతో బంగ్లా 112 పరుగుల ఆధిక్యంలో ఉంది

సిల్హట్: నజ్ముల్ షంటో (60 బ్యాటింగ్) ఆదుకోవడంతో.. జింబాబ్వేతో తొలి టెస్ట్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ పోరాడుతోంది. వర్ష ప్రభావితమైన మూడో రోజైన మంగళవారం ఓవర్‌నైట్ స్కోరు 57/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 194/4 స్కోరు చేసింది. మొత్తంగా బంగ్లా 112 పరుగుల ఆధిక్యంలో ఉంది. మోమినుల్ హక్ (47), హసన్ జాయ్ (33) ఫర్వాలేదనిపించారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 191, జింబాబ్వే 273 రన్స్ చేశాయి.