Share News

Australian cricketer: విషాదం.. ఆసీస్ యువ క్రికెటర్ మృతి

ABN , Publish Date - Oct 30 , 2025 | 01:06 PM

మెల్‌బోర్న్‌కు చెందిన బెన్ అస్టిన్ టీ20 మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ట్రైనింగ్ సెషన్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా బంతి అతడి మెడకు బలంగా తగిలింది. దీంతో ఒక్కసారిగా మైదానంలో అతడు కుప్పకూలిపోయాడు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ మృతి చెందాడు.

Australian cricketer: విషాదం.. ఆసీస్ యువ క్రికెటర్ మృతి

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పదకొండేళ్ల క్రితం ఫిల్ హ్యూస్ మైదానంలోనే కుప్పకూలిన ఉదంతం ఇప్పటికీ అభిమానులను కలవరపెడుతూనే ఉంది. అయితే ఇదే తరహాలో 17 ఏళ్ల యువ క్రికెటర్(young cricketer death) ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది.

మెల్‌బోర్న్‌కు చెందిన బెన్ అస్టిన్(Ben Austin) టీ20 మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ట్రైనింగ్ సెషన్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా బంతి అతడి మెడకు బలంగా తగిలింది. దీంతో ఒక్కసారిగా మైదానంలో అతడు కుప్పకూలిపోయాడు. సహచర క్రికెటర్లు స్పందించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు రెండు రోజులపాటు మృత్యువుతో పోరాడిన అస్టిన్ గురువారం ఉదయం ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. ప్రాక్టీస్ సమయంలోనూ అతడు తలకు హెల్మెట్ పెట్టుకుని ఉన్నట్లు అక్కడి క్రికెట్ వర్గాలు తెలిపాయి.

బెన్ మరణంపై ఫెర్న్‌ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘బెన్ క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్ మ్యాచ్‌లు కూడా ఆడేవాడు. అతడి ఆకస్మిక మరణం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. అతడి మృతి మా క్రికెట్ కమ్యూనిటీపై ప్రభావం చూపిస్తుంది. ఈ సందర్భంగా అందరికీ ఓ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి సమయంలో బెన్ కుటుంబం గోప్యతకు భంగం కలిగించవద్దు’ అని పేర్కొంది.

ఈ వార్తలు కూడా చదవండి..

Gold Price Today: ఇవాళ్టి మార్కెట్లో బంగారం ధరలు

బీఆర్‌ఎస్‌ గెలిస్తే మూడేళ్లు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు

Updated Date - Oct 30 , 2025 | 01:06 PM