Share News

Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్

ABN , Publish Date - Apr 20 , 2025 | 08:39 PM

NADA: భారత క్రీడా రంగంలో డోపింగ్ మరోమారు ప్రకంపనలు రేపింది. డోపింగ్ ఆరోపణతో ఏకంగా 10 మందిపై నాడా బ్యాన్ వేసింది. ఈ నేపథ్యంలో నిషేధం ఎదుర్కొంటున్న జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ రమేశ్ నాగపురి తాజాగా రియాక్ట్ అయ్యారు. ఇంతకీ ఆయన ఏం అన్నారంటే..

Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్
Ramesh Nagapuri

డోపింగ్ వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణల మీద నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ రమేశ్ నాగపురి స్పందించారు. తాను ఎప్పుడూ ఎలాంటి తప్పుడు పనులు కూడా చేయలేదన్నారు. తప్పు చేసిన వారిని ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభావంతులైన పేద క్రీడాకారులను తీర్చిదిద్దడానికే తన జీవితాన్ని ధారపోశానని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని రమేశ్ నాగపురి స్పష్టం చేశారు.


అసలేం జరిగింది..

డోపింగ్ ఆరోపణలతో ఏడుగురు అథ్లెట్లు, ముగ్గురు కోచ్‌లను నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) ఆదివారం బ్యాన్ చేసింది. నిషేధం ఎదుర్కొంటున్న జాబితాలో ఇద్దరు ఇతర కోచ్‌లతో పాటు జూనియర్ జాతీయ జట్టు చీఫ్ కోచ్ రమేష్ నాగపురి కూడా ఉన్నారు. హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు జూనియర్ చీఫ్ కోచ్‌గా సేవలు అందిస్తున్న ఆయనపై ఆర్టికల్ 2.9 కింద యాంటీ డోపింగ్ రూల్స్‌ను ఉల్లంఘించారనే నేరం మీద సస్పెండ్ చేసింది నాడా. ఈ నేపథ్యంలో సస్పెన్షన్‌పై పైవిధంగా రియాక్ట్ అయ్యారు రమేశ్ నాగపురి. తానే తప్పూ చేయలేదన్నారు.


గతంలోనూ..

గతంలోనూ ఇలాంటి పలు ఉదంతాలు చోటుచేసుకున్నాయి. 2023లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) హైదరాబాద్ ట్రైనింగ్ సెంటర్‌లోని హాస్టల్ గదుల్లో కొన్ని నిషేధిత వస్తువులు దొరికాయి. దీంతో నాడు శిక్షణా కేంద్రంలోని ఐదుగురు అథ్లెట్లను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఎస్.యుగేందర్, ఎ.తరుణ్, ఎల్.లక్ష్మణ్ తేజ్, శ్రీనివాస్, ఎన్.శరత్ మీద చర్యలు తీసుకున్నారు. అప్పుడు కూడా సాయ్ సీనియర్ అథ్లెటిక్స్ కోచ్‌గా నాగపురి రమేష్ ఉన్నారు.


ఇవీ చదవండి:

ఆర్సీబీ.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

పక్కా ప్లేఆఫ్స్‌కు వెళ్లేది ఎవరంటే..

కేకేఆర్‌ చెంతకు అభిషేక్‌ నాయర్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 20 , 2025 | 08:40 PM