Ajith Kumar: దుబాయ్ కార్ రేసులో అజిత్ కుమార్ టీం విక్టరీ.. మాధవన్ సహా పలువురి విషెస్..
ABN , Publish Date - Jan 12 , 2025 | 06:31 PM
దుబాయ్‌లో జరిగిన 24 గంటల కార్ రేసులో హీరో అజిత్ కుమార్ బృందం 992 విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. దీంతో అజిత్ కుమార్ భారత జాతీయ జెండాతో విజయోత్సవాన్ని జరుపుకుని అభిమానులను ఉర్రూతలూగించారు.

దుబాయ్‌లో జరిగిన 24 గంటల దుబాయ్ 2025 అంతర్జాతీయ కార్ రేస్ (Dubai Car Race)లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నేతృత్వంలోని జట్టు మూడో స్థానంలో నిలిచింది. దీంతో అజిత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న అజిత్ కుమార్ కార్ రేసర్‌గా ఎంపికయ్యారు. ఆయన నాయకత్వంలోనే అజిత్‌కుమార్ రేసింగ్ పేరుతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ జట్టు 24H దుబాయ్ 2025 కార్ రేస్‌లో పాల్గొనడమే కాకుండా విజయం కూడా సాధించింది. ఈ రేసులో అజిత్ సారథ్యంలోని జట్టు మూడో స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది.
ప్రాక్టీస్ సమయంలో
దీనికి సంబంధించి అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సమాచారాన్ని తెలియజేశారు. అందులో 'దుబాయ్‌లో జరిగిన కార్ రేస్‌లో అజిత్ 991 కేటగిరీ, జీ14 విభాగంలో మూడో స్థానంలో నిలిచారు. ప్రాక్టీస్ సమయంలో బ్రేక్ వేయకపోవడంతో అజిత్ కారు ప్రమాదానికి గురైంది. లోపల కూర్చున్న అజిత్ కవచం ధరించడంతో ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదం జరిగిన కొద్ది రోజుల్లోనే అజిత్ జట్టు విజయాన్ని సాధించిందని సురేష్ చంద్ర గర్వంగా తెలిపారు.
మాధవన్ స్పెషల్ విషెస్..
ఈ టోర్నీలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లతో అజిత్ భారత జాతీయ జెండా పట్టుకుని నిలబడ్డారు. ఆ క్రమంలో అజిత్ కొడుకు ఆయనతో నిలబడి ట్రోఫీని పట్టుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అలాగే జాతీయ జెండాను ఊపుతూ అజిత్ స్టేడియం చుట్టూ తిరుగుతున్న వీడియో చూసిన అభిమానులు సంతోషిస్తున్నారు. దుబాయ్ కార్ రేస్‌లో విజేతగా నిలిచిన అజిత్ కుమార్‌ను నటుడు మాధవన్ వ్యక్తిగతంగా అక్కడికి వెళ్లి అభినందించారు. జెర్సీతో జాతీయ జెండాను పట్టుకున్న అజిత్‌ను నటుడు మాధవన్ గర్వంగా అభినందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ రేసుల్లో కూడా పోటీ..
గతంలో ఫార్ములా పోటీల్లో పాల్గొన్న అజిత్ 2010 నుంచి ఏ కార్ రేస్‌లోనూ పాల్గొనలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ రేసింగ్‌లోకి వచ్చిన అజిత్ తన బృందంతో కలిసి దుబాయ్ రేస్‌లో పాల్గొన్నారు. 24 గంటలపాటు జరిగిన ఈ పోటీల్లో అజిత్ బృందం ఎన్నో అడ్డంకుల తర్వాత మూడో స్థానంలో నిలిచింది. దీంతో అజిత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయన టీం విజయం పట్ల విషెస్ తెలియజేస్తున్నారు. దుబాయ్ కార్ రేస్‌తో పాటు అజిత్ కుమార్ యూరప్‌లోని యూరోపియన్ 24 హెచ్, పోర్షే 992 జీటీ కార్ రేస్‌లలో కూడా పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి:
IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు.. కొత్త తేదీ ఎప్పుడంటే..
Next Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్నంటే..
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Tata Tiago: రూ. 7 లక్షలకే.. టాటా ఎలక్ట్రిక్ కార్...
Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ
Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Read More Business News and Latest Telugu News