Share News

Abhishek Sharma: వారి వల్లే నేను చెలరేగుతున్నాను: అభిషేక్ శర్మ

ABN , Publish Date - Nov 08 , 2025 | 08:02 PM

ఆస్ట్రేలియాలో అద్భుతంగా రాణించిన, విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ(163) ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా మాట్లాడిన అభిషేక్ శర్మ.. తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు అభిషేక్ ధన్యవాదాలు తెలిపాడు. వారి సహకారంతోనే తాను దూకుడుగా ఆడగలుగుతున్నానని చెప్పాడు.

Abhishek Sharma: వారి వల్లే నేను చెలరేగుతున్నాను: అభిషేక్ శర్మ

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా స్డేడియం వేదికగా ఆస్ట్రేలియా, భారత్(India vs Australia) మధ్య శనివారం జరిగిన ఆఖరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో ఈ సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన, విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ(163) ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా మాట్లాడిన అభిషేక్ శర్మ.. తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు అభిషేక్(Abhishek Sharma) ధన్యవాదాలు తెలిపాడు. వారి సహకారంతోనే తాను దూకుడుగా ఆడగలుగుతున్నానని చెప్పాడు.


అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఇంకా మాట్లాడుతూ...'నేను ఈ సిరీస్ కోసం చాలాకాలం ఎదురు చూశాను. ఆస్ట్రేలియా పర్యటన(Australia Tour)కు వెళ్తున్నామని తెలిసినప్పుడే నేను ఎంతో సంతోషించాను. ఆస్ట్రేలియా పిచ్‌లు బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటాయని తెలుసు. ఈ సిరీస్ మధ్యలో కూడా నాకు ఇదే అభిప్రాయం కలిగింది. మేం ఇంకా భారీ టార్గెట్లను నమోదు చేయాగలమనిపించింది. హజెల్ వుడ్(Josh Hazlewood) వంటి బౌలర్ ఉండటం ఆసీస్ కు మాత్రమే కాదు.. ఏ జట్టుకైనా అనుకూలమే. అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతని బౌలింగ్ ను నేను ఎంతో ఎంజాయ్ చేశాను. హజెల్ వుడ్ ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకరు. మంచి క్రికెట్ ఆడాలన్నా.. భవిష్యత్తులో మెరుగ్గా రాణించాలన్నా ఇలాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కోవాలి. జట్టు కోసం బాగా ఆడాలంటే ఇలాంటి కఠినమైన బౌలర్లను ఎదుర్కోవాలి.


ఇక మా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(Suryakumar yadav), కోచ్‌ గౌతమ్ గంభీర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను నచ్చినట్లు ఆడమనే స్వేచ్ఛ ఇచ్చారు. ఒక బ్యాటర్‌గా 20, 30 పరుగులే చేయడం సరికాదు. కానీ, జట్టుకు గట్టి పునాది సెట్ చేయాలనే బాధ్యతను వారు నాకు ఇచ్చారు. అందుకోసం నేను నెట్స్‌లో, ఆఫ్ సీజన్‌లో బాగా ప్రాక్టీస్ చేశాను. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్(T20 World CUP) జరగనుంది. ఆ టోర్నీ ఆడటం నా కల. చిన్నప్పటి నుంచి ఈ ప్రపంచ కప్ టోర్నీ గురించే కలలు కన్నాను. నా దేశానికి ప్రపంచకప్ అందివ్వాలనుకున్నాను. ఆ టోర్నీకి నేను రెడీగా ఉండేలా చూసుకుంటాను 'అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్‌లో అభిషేక్ శర్మ 16, 68, 25, 28, 23 నాటౌట్ వరుసగా రాణించాడు. అంతేకాక తక్కువ బంతుల్లో 1000 పరుగులు సాధించిన ఎడమ చేతివాటం తొలి ప్లేయర్ గా అభిషేక్ రికార్డు సృష్టించాడు.


ఇవి కూడా చదవండి

2028 Olympics: భారత్‌, పాక్‌ పోరు లేనట్లేనా..?

ND vs SA Unofficial Test: అదరగొట్టిన ధ్రువ్ జురెల్.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్‌

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 08 , 2025 | 08:03 PM