Share News

Montha Cyclone: మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం

ABN , Publish Date - Nov 08 , 2025 | 07:57 PM

మొంథా తుఫాన్ విపత్తు కారణంగా రాష్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం ఏపీలో పర్యటించనుంది. ఈ బృందంలోని సభ్యులు రెండుగా విడిపోయి.. పలు జిల్లాల్లో పర్యటించనున్నారు.

Montha Cyclone: మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం

అమరావతి, నవంబర్ 08: మొంథా తుఫాన్ విపత్తు కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర బృందం పర్యటించనుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శనివారం అమరావతిలో వెల్లడించారు. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో అంటే.. నవంబర్ 10, 11 తేదీల్లో ఈ బృందం పర్యటించనుందని తెలిపారు. ఈ తుఫాన్ ప్రభావిత జిల్లాలు.. ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో జరిగిన నష్టాల్ని ఈ బృందం అంచనా వేస్తోందన్నారు.


కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన బృందం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుందని వివరించారు. అయితే వీరు రెండు బృందాలుగా ఏర్పడి.. సోమవారం టీం 1 బాపట్ల జిల్లాలో, టీం-2 కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించనుందని తెలిపారు. ఇక మంగళవారం టీం-1 ప్రకాశం జిల్లాలో.. టీం-2 కోనసీమ జిల్లాల్లో పర్యటించి నష్టాల్ని స్వయంగా పరిశీలించడంతో పాటు తుఫాను బాధితులతో ఈ బృందంలోని సభ్యులు నేరుగా మాట్లాడతారని చెప్పారు.


ఈ కేంద్ర బృందంలోని సభ్యుల వివరాలు..

1. డా. కె. పొన్ను స్వామి (డైరెక్టర్, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ, డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ డెవలప్‌మెంట్, హైదరాబాద్

2. మహేష్ కుమార్ (డిప్యూటీ డైరెక్టర్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ ఎక్స్‌పెండిచర్, న్యూఢిల్లీ)

3. శ్రీనివాస్ బైరి (డైరెక్టర్, సెంట్రల్ వాటర్ కమిషన్, హైదరాబాద్).

4. శశాంక్ శేఖర్ రాయ్ (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ).

5. మనోజ్ కుమార్ మీనా (అండర్ సెక్రటరీ, గ్రామీణాభివృద్ధి శాఖ).

6. ఆర్తి సింగ్ (డిప్యూటీ డైరెక్టర్ , విద్యుత్ శాఖ, న్యూఢిల్లీ).

7. సాయి భగీరథ్ (సైంటిస్ట్-E, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్).


అక్టోబర్ మాసం చివరిలో ఆంధ్రప్రదేశ్ వైపు మొంథా తుపాన్ దూసుకు వచ్చింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అయితే చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ క్రమంలో సీఎం చంద్రబాబు, ఆయన మంత్రి వర్గంతోపాటు ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. అందులో భాగంగా ఆర్టీజీఎస్ ద్వారా తుపాన్‌ ప్రభావాన్ని అంచనా వేసి.. జిల్లా అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు జారీ చేశారు.


అలాగే తుపాన్ ప్రభావిత జిల్లాల్లో లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. తద్వారా ఈ తుపాన్ కారణంగా.. ప్రాణ నష్టాన్ని తగ్గించారు. ఆస్తి, పంట నష్టం బాగానే జరిగింది. ఇక ఈ తుపాన్ ప్రభావంపై కేంద్రం సైతం దృష్టి సారించింది. దీనిపై ఇప్పటికే కేంద్రానికి ప్రభుత్వం నివేదించింది. ఈ నేపథ్యంలో ఈ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. అందుకు సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఈ బృందం అందించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కుప్పంలో ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు

దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న ఎర్రచందనం ఏపీదే : పవన్‌

For More AP News And Telugu News

Updated Date - Nov 08 , 2025 | 08:08 PM