Viral Video: అలాంటి ఫొటోలు తీయకండి.. పాపరాజీలపై హీరోయిన్ ఆగ్రహం..
ABN , Publish Date - Jul 11 , 2025 | 08:44 AM
Zareen Khan To Paparazzi: ఓ యువకుడు హీరోయిన్ జరీన్ ఖాన్ దగ్గరకు వచ్చాడు. తనను తాను ఆమె అభిమానిగా పరిచయం చేసుకున్నాడు. తర్వాత తన టాలెంట్ చూపించాడు. ఆమె ముందు జిమ్నాస్టిక్స్ చేశాడు. జరీన్ ఎంతో ఓపిగ్గా అతడి జిమ్నాస్టిక్స్ చూసింది.

ముంబై: సెలెబ్రిటీలు ఎక్కడ ఉంటే.. పాపరాజీలు అక్కడ ఉంటారు. సెలెబ్రిటీలు కనిపిస్తే చాలు తమ కెమెరాలకు పని చెబుతూ ఉంటారు. ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉంటారు. అయితే, చాలా సందర్భాల్లో ఫొటోలు, వీడియోల పేరుతో సెలెబ్రిటీలను వేధిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అసభ్యకరంగా ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉంటారు. తాజాగా, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ విషయంలోనూ అదే జరిగింది. వారు చేసిన పనికి ఆమెకు కోపం తెప్పించింది. దీంతో జరీన్ తనదైన స్టైల్లో పాపరాజీలకు వార్నింగ్ ఇచ్చింది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. జరీన్ ఖాన్ నిన్న(గురువారం) ముంబై, అంథేరీలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ ఉన్న పాపరాజీలు ఆమెను చూసి ఫొటోలు, వీడియోలు తీయటం మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే ఓ యువకుడు ఆమె దగ్గరకు వచ్చాడు. తనను తాను ఆమె అభిమానిగా పరిచయం చేసుకున్నాడు. తర్వాత తన టాలెంట్ చూపించాడు. ఆమె ముందు జిమ్నాస్టిక్స్ చేశాడు. జరీన్ ఎంతో ఓపిగ్గా అతడి జిమ్నాస్టిక్స్ చూసింది. అతడ్ని ప్రశంసించి అక్కడి నుంచి ముందుకు కదిలింది.
అయితే, పాపరాజీలు మాత్రం ఆమెను ఫొటోలు, వీడియోలు తీయటం ఆపలేదు. వెనుక నుంచి తన ఫొటోలు, వీడియోలు తీయటం ఆమెకు ఇబ్బందిగా అనిపించింది. దీంతో పాపరాజీలపై జరీన్ కు కోపం వచ్చింది. వెంటనే వెనక్కు తిరిగి.. ‘ముందు నుంచి ఫొటోలు తీయండి. వెనుక నుంచి కాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు పాపరాజీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెనుక నుంచి ఆడవాళ్ల ఫొటోలు తీయటం ఏంటని మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
మహిళను పొగిడిన షాపు సిబ్బంది.. ఆమె భర్త చేసిన పనికి అందరూ షాక్..
బంగారం కొనాలనుకునే వారికి షాక్.. పెరిగిన బంగారం ధరలు..