China man mum trend: కౌగిలింతకు రూ.600.. చైనాలో ఈ కొత్త ట్రెండ్ గురించి తెలుసా..
ABN , Publish Date - Nov 22 , 2025 | 06:20 PM
చైనాలో ఊపందుకుంటున్న ఓ కొత్త ట్రెండ్ ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. ఆ కొత్త ట్రెండ్ పేరు 'మ్యాన్-మమ్'. యువతులు రూ. 600 చెల్లించి 5 నిమిషాల పాటు పురుషుడిని హాగ్ చేసుకోవడమే ఈ 'మ్యాన్-మమ్' ట్రెండ్
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో అది ప్రపంచమంతా పాకేస్తోంది. ఏ దేశంలో ఏ అంశం ట్రెండింగ్‌లో ఉందో అందరికీ ఇట్టే తెలిసిపోతోంది. చైనాలో ఊపందుకుంటున్న ఓ కొత్త ట్రెండ్ ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. ఆ కొత్త ట్రెండ్ పేరు 'మ్యాన్-మమ్'. యువతులు రూ. 600 చెల్లించి 5 నిమిషాల పాటు పురుషుడిని హాగ్ చేసుకోవడమే ఈ 'మ్యాన్-మమ్' ట్రెండ్ (600 rupees hug service).
బిజీ బిజీ జీవితంలో ఇతరులతో మాట్లాడేందుకు సమయం లేక, ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోవడంతో మాట్లాడే వారు లేక ఒంటరిగా ఫీలయ్యే మహిళలు, యువతులకు ఈ సరికొత్త 'మ్యాన్-మమ్' ట్రెండ్ ఎంతో సహాయపడుతోందట. వాళ్ల దయనందిన జీవితంలోని ఒత్తిడి, ఆందోళన, టెన్షన్స్‌ను దూరం చేసుకునేందుకు ఈ కౌగిలింతల ట్రెండ్ సహాయపడుతోందట. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్స్ కూడా పుట్టుకొచ్చాయట (viral hug trend China).
మహిళను లేదా యువతిని ఒంటరితనం ఆవహించినపుడు మ్యాన్-మామ్ పురుషుడిని బుక్ చేసుకొని హగ్ చేసుకుంటారు (man mum trend). ఇందుకు కోసం ఆ పురుషుడికి 20 నుంచి 50 యువాన్లు.. అంటే మన కరెన్సీ ప్రకారం రూ. 250 నుంచి రూ.600 వరకు చెల్లిస్తారు. హగ్ చేసుకునేందుకు వచ్చే యువకులు బుక్ చేసుకున్న అమ్మాయిలను ఎలాంటి ప్రశ్నలు అడగకుండా, వారికి ఎలాంటి హానీ కలిగించకుండా పూర్తిగా సహకరిస్తారట. దీంతో చైనాలో ఈ ట్రెండ్ బాగా ప్రాచుర్యం పొందుతోందట.
ఇవి కూడా చదవండి..
మీ కళ్లకు టెస్ట్.. ఈ ఫొటోలో కొండచిలువ ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..
వామ్మో.. లవర్‌కు ఇలాంటి గిఫ్ట్ ఎవరైనా ఇస్తారా.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
మరిన్ని వైరల్ వార్తలు కోసం క్లిక్ చేయండి..