ఇది కూడా కారేనండోయ్...
ABN , Publish Date - Jul 27 , 2025 | 01:22 PM
నగరాల్లో ట్రాఫిక్ కష్టాల గురించి తెలిసిందే. గంటల కొద్దీ నిలిచిపోయే ట్రాఫిక్‌తో నిత్యం నరకమే. ముఖ్యంగా కారులో వెళ్లే వారి బాధ చెప్పనక్కర్లేదు. ముందుకూ, వెనక్కి వెళ్లలేని పరిస్థితి. అందుకే ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించు కునేందుకు కారును బైక్‌లా మార్చేశాడు ఒక ఔత్సాహిక మెకానిక్. కారులాంటి బైకులో కూర్చుని, రయ్యిన దూసుకెళ్తున్నాడు.

నగరాల్లో ట్రాఫిక్ కష్టాల గురించి తెలిసిందే. గంటల కొద్దీ నిలిచిపోయే ట్రాఫిక్‌తో నిత్యం నరకమే. ముఖ్యంగా కారులో వెళ్లే వారి బాధ చెప్పనక్కర్లేదు. ముందుకూ, వెనక్కి వెళ్లలేని పరిస్థితి. అందుకే ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించు కునేందుకు కారును బైక్‌లా మార్చేశాడు ఒక ఔత్సాహిక మెకానిక్. కారులాంటి బైకులో కూర్చుని, రయ్యిన దూసుకెళ్తున్నాడు.
ఎంత చిన్న కారైనా కనీసం ఐదుగురు కూర్చుని ప్రయాణించవచ్చు. కానీ ఇటలీలోని బాగ్నొలో క్రెమాస్కో అనే చిన్న పట్టణానికి చెందిన ఆండ్రియా మరాజీ తయారుచేసిన కారులో ఒక్కరు మాత్రమే కూర్చోవచ్చు. ఇది ప్రపంచంలోనే అతి సన్నని కారుగా గుర్తింపు పొందింది. స్వతహాగా మెకానిక్ అయినమరాజీ ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కేందుకు తన1993 మోడల్ ఫియట్ కారును బైక్‌లా సన్నగా తీర్చిదిద్దారు. అతడి క్రేజీ ఐడియా ప్రముఖ అంతర్జాతీయ పత్రికల్లో హెడ్‌లైన్స్‌లో నిలిచింది.
అతి సన్నటి కారు ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ కారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 25 కి.మీ ప్రయాణించవచ్చు. 50 సెంటీమీటర్ల వెడల్పు, 340 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అంటే ఒక్క డ్రైవర్ మాత్రమే కూర్చునేంత స్థలం ఉంటుంది. ఈ ‘న్యారో కారు’ను తయారు చేయడానికి మరాజీ ఏడాది పాటు శ్రమించాడు. కారు తయారీలో నాణ్యమైన విడిభాగాలను మాత్రమే ఉపయోగించాడు. అయితే ఇదిసగటున గంటకు 15 కి.మీ వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. ‘‘ఒక క్రేజీ ఐడియాతో నా జంక్‌యార్డ్‌లో పని ప్రారంభించాను. కటింగ్, వెల్డింగ్ పనులను ఓపిగ్గా చేశాను.
కారు వెడల్పు తక్కువ కాబట్టి స్కూటర్ ఇంజన్ అమర్చాను. హెడ్‌లైట్, ఇండికేటర్స్, విండో మిర్రర్స్, స్టీరింగ్, బ్రేక్... ఇలా అన్నీ మామూలు కారుకు ఉండేవన్నీ ఇందులో ఉంటాయి. వెనక్కి తీసుకోవడానికి రివర్స్‌గేర్ ఆప్షన్ కూడా ఉంది. ఈ కారును పార్కు చేయడానికి టూవీలర్ పార్క్ చేసేంత స్థలం చాలు’’ అంటున్నాడు మరాజీ. ఈ వాహనానికి అనుమతులు లేకపోయినా... వ్యాపారాన్ని పెంచుకోవడానికి, అందరి దృష్టిని ఆకర్షించడానికి మరాజీ ఈ ప్రాజెక్టును డిజైన్ చేశాడు. తన కలల కారుకు ‘గిన్నిస్ వరల్డ్ రికార్డు’ల్లో చోటు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. రోడ్డు మీద న్యారో కారు వెళ్తుంటే మాత్రం అందరూ వింతగా చూస్తున్నారు.