Snake viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఒకేసారి రెండు కప్పలను మింగిన పాము పరిస్థితి చూడండి..
ABN , Publish Date - Aug 03 , 2025 | 03:59 PM
పాములు, వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ భారీ సర్పానికి చెందిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ పాము ఒకేసారి రెండు కప్పలను మింగేసింది. అయితే వాటిని జీర్ణం చేసుకోలేక ఆపసోపాలు పడింది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాతి ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పాములు (Snake), వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ భారీ సర్పానికి చెందిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ పాము ఒకేసారి రెండు కప్పలను మింగేసింది. అయితే వాటిని జీర్ణం చేసుకోలేక ఆపసోపాలు పడింది (Snake swallowed two frogs).
cobra_lover_suraj అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ పాము తన గొంతులో ఏదో ఇరుక్కుపోవడంతో ఆపసోపాలు పడుతోంది. నొప్పితో మెలికలు తిరిగిపోతోంది. చివరకు దాని నోటిలో నుంచి రెండు భారీ కప్పలు బయటకు వచ్చాయి. ఒకేసారి రెండు కప్పలను మింగేసిన తర్వాత ఆ పాము కదల్లేకపోయింది. దాని పొట్ట భాగమంతా ఉబ్బిపోయింది. వాటిని బయటకు కక్కేసిన తర్వాత ఆ పాము సాధారణ స్థితికి వచ్చింది. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను దాదాపు 3 లక్షల మంది వీక్షించారు. 26 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఆ పాముకు అత్యాశ ఎక్కువని ఒకరు కామెంట్ చేశారు. ఆహారం విషయంలో ఏ జీవి అయినా పరిమితులను దృష్టిలో పెట్టుకోవాలని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
మీది డేగ చూపు అయితే.. ఈ చింపాంజీ కళ్లజోడు ఎక్కడుందో 5 సెకెన్లలో కనుక్కోండి..
మీ పిల్లలు ఎక్కువగా మొబైల్ చూస్తున్నారా? ఈ ట్రిక్ ఉపయోగించి చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..