Viral Video: వామ్మో.. అంత వరదలో బైక్ మీద ఎలా వెళ్తున్నాడో చూడండి.. వీడియో వైరల్..
ABN , Publish Date - Jun 29 , 2025 | 10:35 AM
వారం రోజులుగా గుజరాత్ రాష్ట్రం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతోంది. జనజీవన స్థంభించిపోయింది. గత వారం రోజుల్లో గుజరాత్ రాష్ట్రంలో 100 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

వారం రోజులుగా గుజరాత్ (Gujarat) రాష్ట్రం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతోంది. జనజీవన స్థంభించిపోయింది. గత వారం రోజుల్లో గుజరాత్ రాష్ట్రంలో 100 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది (Gujarat Floods). ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. గత మంగళవారం సూరత్ (Surat)లో కురిసిన వర్షపాతం గత 40 ఏళ్ల రికార్డులను తిరగరాసింది. ఈ వర్షంతో జనాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
సూరత్‌లో వరద స్థాయి ఏ రేంజ్‌లో ఉందో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూరత్ వీధులు పూర్తిగా మోకాలు లోతు నీటితో నిండిపోయాయి. దీంతో జనాలు బయటకు రావడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఓ వ్యక్తి బైక్ మీద కూర్చుని ఆ వరద నీటిలోనే ప్రయాణిస్తున్నాడు. ఆ బైక్ పూర్తిగా నీటిలోనే ఉంది. అయినా కూడా ఆ బైక్ అంత వరదలో కూడా ప్రయాణించడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. అతడిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు ఏడు లక్షల మందికి పైగా వీక్షించారు. 18 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. అది ఏ బైక్ అయినా గానీ, అది వారి అడ్వర్టైజ్‌మెంట్‌కు బాగా పనికొస్తుందని ఒకరు కామెంట్ చేశారు. ఇంత ప్రమాదకర ప్రయాణం అవసరమా అని మరొకరు ప్రశ్నించారు. అన్ని డ్రైనేజీలు, గట్టర్‌లు శుభ్రంగా ఉంటే ఇలాంటి వరద లాంటి పరిస్థితి ఎదురుకాదని ఒకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఆ జీబ్రా పోరాటానికి హ్యాట్సాఫ్.. నీటిలో మొసళ్ల నుంచి ఎలా తప్పించుకుందో చూడండి..
మీది చురుకైన చూపైతే.. ఈ ఫొటోలో కుందేలు ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..