Zebra Fight with Crocodile: ఆ జీబ్రా పోరాటానికి హ్యాట్సాఫ్.. నీటిలో మొసళ్ల నుంచి ఎలా తప్పించుకుందో చూడండి..
ABN , Publish Date - Jun 29 , 2025 | 07:39 AM
నీటిలోని మొసలికి చిక్కితే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఎంత పెద్ద ఏనుగు అయినా నీటిలోని మొసలి బలం ముందు నిలవలేదు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ జీబ్రా నీటిలోని మొసళ్ల గుంపునకు దొరికిపోయింది. వాటి బారి నుంచి ప్రాణాలతో బయటపడడానికి ధైర్యంగా పోరాడింది.

నీటిలోని మొసలికి (Crocodile) చిక్కితే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఎంత పెద్ద ఏనుగు అయినా నీటిలోని మొసలి బలం ముందు నిలవలేదు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ జీబ్రా (Zebra) నీటిలోని మొసళ్ల గుంపునకు దొరికిపోయింది. వాటి బారి నుంచి ప్రాణాలతో బయటపడడానికి ధైర్యంగా పోరాడింది. ఆ వీడియోను ఓ వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (Viral Video).
@AMAZlNGNATURE అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ సరస్సులో నీరు తాగేందుకు జీబ్రా వెళ్లింది. ఆ సరస్సులో మొసళ్లు ఆ జీబ్రాను చుట్టుముట్టాయి. అయితే వాటి నుంచి తప్పించుకునేందుకు జీబ్రా ధైర్యంగా పోరాడింది. ఓ మొసలి నోటిని తన నోటితో పట్టుకుని కొరికేసింది. మరికొన్ని మొసళ్లు దాడి చేయడానికి ప్రయత్నించగా వాటిని కూడా ధైర్యంగా ఎదుర్కొని ఒడ్డు మీదకు వెళ్లిపోయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.5 కోట్ల మంది వీక్షించారు. 1.4 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. జీబ్రా ధైర్యం ముందు మొసళ్ల బలం నిలువలేకపోయిందని ఒకరు కామెంట్ చేశారు. జీవితంలో చివరి నిమిషం వరకు ధైర్యంగా పోరాడాలని ఈ జీబ్రా పాఠం నేర్పుతోందంటూ మరొకరు పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆశ కోల్పోకుండా ఫైట్ చేయాలని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఆహా.. ఇలాంటి పేదరికం అందరికీ కావాలి.. ఈ గుడిసెను చూస్తే నివ్వెరపోవాల్సిందే..
వామ్మో.. నూడిల్స్ తింటే ఇంత ప్రమాదమా.. నూడిల్స్ ప్యాకెట్ మీద ఏం రాసి ఉందంటే..
వామ్మో.. ఈ కుర్రాడు నిజంగా మనిషేనా.. వేడి వేడి నూనెలో చేతులు పెట్టి ఏం చేస్తున్నాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..