Shocking Video: ఇదెక్కడి పిచ్చి భయ్యా.. హై టెన్షన్ వైర్‌కు వేలాడి.. బాబోయ్..
ABN , Publish Date - Aug 04 , 2025 | 09:24 AM
సోషల్ మీడియా కారణంగా చాలా మంది పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. జనాలను ఆకట్టుకునే వీడియో రూపొందించి ఎలాగైనా పాపులారిటీ సంపాదించుకోవాలనే ఆత్రుత చాలా మందిలో పెరిగిపోతోంది. అందుకోసం రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ప్రాణాంతక సాహసాలకూ ఒడిగడుతున్నారు.

సోషల్ మీడియా కారణంగా చాలా మంది పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. జనాలను ఆకట్టుకునే వీడియో రూపొందించి ఎలాగైనా పాపులారిటీ సంపాదించుకోవాలనే ఆత్రుత చాలా మందిలో పెరిగిపోతోంది. అందుకోసం రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ప్రాణాంతక సాహసాలకు (Dangerous Stunts) ఒడిగడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి చేసిన పని చూసిన వారంతా షాకవుతున్నారు. రైల్వే స్టేషన్‌లో రైలు ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్‌కు (overhead wire) ఓ వ్యక్తి వేలాడుతూ కనిపించాడు.
shashikantdubey2016 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి 25 వేల కేవీ ఓవర్ హెడ్ వైర్ పై వేలాడుతూ, ఒక ప్రమాదకర స్టంట్ చేస్తున్నాడు. అటూ ఇటూ ఊగుతున్నాడు. స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు అతడిని చూసి కేకలు పెడుతున్నారు. ఆ ఘటన ప్రయోగ్‌రాజ్ స్టేషన్‌లో జరిగినట్టు తెలుస్తోంది. అతడు పైకి, కిందకు ఊగడం వల్ల ఆ వైర్ మొత్తం ఊగిపోతోంది. కాసేపు ఊగిన తర్వాత ఆ వ్యక్తి కిందకు దూకేసి పట్టాల పక్కన పడ్డాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 30 లక్షల మంది వీక్షించారు. దాదాపు 2.5 లక్షల మంది ఈ వీడియోను వీక్షించి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనపై రైల్వే యంత్రాంగం రంగంలోకి దిగింది. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు అలాంటి పని చేశాడని దర్యాఫ్తు ప్రారంభించారు. అతడు మద్యం మత్తులో ఉన్నట్టు చాలా మంది భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఒకేసారి రెండు కప్పలను మింగిన పాము పరిస్థితి చూడండి..
ఈ మంచులో కుక్క ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెడితే.. మీ కళ్లకు తిరుగులేదు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..