Jugaad Video: వావ్.. ఈ తెలివికి సలాం కొట్టాల్సిందే.. కారులో గాలి కోసం ఎలాంటి స్కెచ్ వేశాడో చూడండి..
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:07 PM
చాలా మంది పెద్ద పెద్ద సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. తాము ఎదుర్కంటున్న సమస్యలను చిటికెలో పరిష్కరిస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మన దేశంలో చాలా మంది సాధారణ వ్యక్తులు కూడా అసాధారణంగా ఆలోచిస్తుంటారు. పెద్ద పెద్ద సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. తాము ఎదుర్కంటున్న సమస్యలను చిటికెలో పరిష్కరిస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు (Jugaad Video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ జుగాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి కారు (car)లోకి ప్రకృతిసిద్ధమైన గాలి (Natural Air) రావడం కోసం విచిత్రమైన ఏర్పాటు చేశాడు.
studentgyaan అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కారు రోడ్డు మీద వేగంగా ప్రయాణిస్తోంది. ఆ కారు డ్రైవర్ బయటి నుంచి తాజా గాలి లోపలికి రావడం కోసం ఓ విచిత్రమైన ఏర్పాటు చేశాడు. ఓ ప్లాస్టిక్ పైప్‌ను పెట్టుకున్నాడు. బయటి నుంచి గాలి లోపలికి వచ్చే విధంగా ఆ పైప్‌ను అమర్చాడు. ఆ కారు ముందుకు వెళ్తుంటే బయటి గాలి వేగంగా ఆ పైప్ ద్వారా లోపలికి వస్తోంది. ఆ టెక్నిక్‌ను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోకు సోషల్ మీడియాలో లక్షల కొద్దీ లైక్‌లు వచ్చాయి. వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఇది చాలా చవకైన, సులభమైన పరిష్కారం అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ఈ ఏర్పాటు వల్ల పెట్రోల్ ఖర్చు తగ్గుతుందని, పర్యావరణానికి కూడా ఎలాంటి హానీ ఉండదని మరొకరు పేర్కొన్నారు. ఏసీ కారు కలిగిన వారు దీనిని చూసి షాకవుతారని ఇంకొకరు సరదాగా కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
మీది డేగ చూపు అయితే.. ఈ చింపాంజీ కళ్లజోడు ఎక్కడుందో 5 సెకెన్లలో కనుక్కోండి..
మీ పిల్లలు ఎక్కువగా మొబైల్ చూస్తున్నారా? ఈ ట్రిక్ ఉపయోగించి చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..