Vande Bharat Sleeper Trains: పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్.. అత్యాధునిక హంగులతో..
ABN , Publish Date - Oct 28 , 2025 | 05:09 PM
అత్యాధునిక హంగులతో వందే భారత్ స్లీపర్ రైళ్లను రైల్వే శాఖ రూపొందించింది. మరికొద్ది రోజుల్లో ఇవి పట్టాలెక్కనున్నాయి. విమానంలో ప్రయాణికులకు ఏ విధంగా సౌకర్యాలు ఉంటున్నాయో.. అదే తరహాలో ఈ స్లీపర్ కోచ్‌ల్లో ఏర్పాట్లు చేశారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: వందేభారత్ రైళ్లు.. భారతీయ రైల్వే ముఖ చిత్రాన్ని మార్చేశాయి. సుదూర ప్రాంతాలకు సైతం కొన్ని గంటల్లోనే ప్రయాణికులు చేరుకోనేలా ఈ రైళ్లను రూపకల్పన చేశారు. దీంతో ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరిగింది. అయితే మరికొద్ది రోజుల్లో వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లలో ప్రయాణికుల కోసం అత్యాధునిక వసతులు.. హైటెక్ ఫీచర్స్ కల్పించారు. అంటే విమానంలో ప్రయాణికులకు ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నారో.. అలాగే ఈ స్లీపర్ రైళ్లలో సదుపాయాలను కల్పిస్తారు.
స్లీపర్ రైళ్లో ప్రత్యేకతలు..
ఈ రైలులోని ప్రతి కోచ్ పూర్తిగా ఎయిర్ కండిషన్ చేశారు. విశాలమైన బెడ్‌లతోపాటు వాటిపైకి ఎక్కేందుకు మెట్లు కూడా సౌకర్య వంతంగా ఏర్పాటు చేశారు. ఆధునిక ఇంటీరియర్‌లను ఏర్పాటు చేశారు. అలాగే అత్యంత భద్రత ఏర్పాట్లతో ఈ కోచ్‌లను తయారు చేశారు. వికలాంగుల ప్రయాణికుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, ఆటోమేటిక్ ఇంటర్ కోచ్ తలుపులు ఏర్పాటు చేశారు.
వైఫై, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్టులు, సెన్సార్ ఆధారిత లైటింగ్‌తోపాటు డిజిటల్ ఇన్ఫర్మేషన్ ప్యానెళ్లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. అలాగే రైలు ప్రమాదాలను నిరోధించేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రక్షణ వ్యవస్థ కవచ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ వ్యవస్థ వందే భారత్ రైళ్లకు ఉంది. ఈ రైళ్లు గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు కాగా.. సర్వీస్ వేగం గంటకు 160 కిలోమీటర్లుగా నిర్ణయించారు.
మరోవైపు ఉదయం వేళల్లో సెమీ హై స్పీడ్ వేగంతో నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు విజయవంతమైయ్యాయి. అయితే రాత్రి వేళల్లో.. అంటే 700 నుంచి 1200 కిలోమీటర్లు లేదా అంతకంటే అధిక దూరం ప్రయాణికుల కోసం ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రైళ్లలో ప్రోటో టైప్ 16 కోచ్‌లు ఉంటాయి. 11 ఏసీ 3 ట్రైర్, 1 ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంటాయి.
ఈ రైలులో దాదాపు 1,128 మంది ప్రయణికులు ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించారు. సీటింగ్, స్లీపింగ్ వసతితోపాటు ప్రయాణికులకు 823 బెర్త్‌లు ఏర్పాటు చేశారు. ఈ రైళ్లను తొలుత ఢిల్లీ నుంచి అహ్మదాబాద్, భోపాల్, పాట్నా తదితర నగరాల మధ్య నడపనున్నారు. దీని వల్ల దాదాపు 1000 కిలోమీటర్ల దూరానికి ప్రయాణ సమయం బాగా తగ్గుతుందని రైల్వే శాఖ భావిస్తుంది. ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు మరికొద్ది రోజుల్లో పట్టాలు ఎక్కనున్నాయి. వీటికి సైతం ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోందని రైల్వే శాఖ భావిస్తోంది.
ఇవి కూడా చదవండి
చెర్నోబిల్‌లో ‘నీలి కుక్కలు’..!
ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
For More Prathyekam And Telugu News