Share News

Tiger attack video: కళ్ల ముందే దారుణం.. అడవిలో కారు ఆపి రీల్స్ చేస్తుంటే.. షాక్..

ABN , Publish Date - Nov 15 , 2025 | 01:03 PM

సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందడం కోసం కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.

Tiger attack video: కళ్ల ముందే దారుణం.. అడవిలో కారు ఆపి రీల్స్ చేస్తుంటే.. షాక్..
shocking wildlife moment

ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందడం కోసం ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (tiger attacks boyfriend).


@singh_kikki అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. అడవి మధ్యలో ఒక కారు ఆగింది. ఓ యువతి కారు లోపల కూర్చుని ఉంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ బయట నిలబడి రీల్ కోసం నటిస్తున్నాడు. బాయ్‌ఫ్రెండ్‌కు ఆ యువతి కొన్ని సూచనలు ఇస్తోంది. ఇంతలో అకస్మాత్తుగా పొదల నుంచి ఒక పెద్ద పులి బయటకు వచ్చి ఆ యువకుడిపై దాడి చేసింది. ఒక్కసారిగా షాకైన ఆ అమ్మాయి కేకలు వేసింది (wildlife attack incident).


ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (shocking wildlife moment). 2.8 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను వీక్షించారు. రెండు వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. రీల్ కోసం ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌ను తినేసిందని ఒకరు కామెంట్ చేశారు. ఈ వీడియో నిజమైనదేనా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ జంట ఇంత తీవ్రమైన ప్రమాదంలో ఎలా చిక్కుకుందో అని కొందరు ఆశ్చర్యపోయారు.


ఇవి కూడా చదవండి..

ఇంత రిస్క్ ఎందుకు బ్రదర్.. బిజీ రోడ్డుపై స్కూటీ ఎలా నడుపుతున్నాడో చూడండి..

మీ బ్రెయిన్ స్పీడ్‌కు టెస్ట్.. ఈ ఫొటోలోని భిన్నమైన సంఖ్యలను 17 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 15 , 2025 | 01:03 PM