Share News

Spacetop-G1: ఈ ల్యాప్‌టాప్‌‌కు స్క్రీన్ ఉండదు.. ఎలా పని చేయాలంటే?

ABN , Publish Date - Oct 12 , 2025 | 05:05 PM

స్పేస్‌టాప్‌-జీ1 కంప్యూటర్ మోడల్ ఒక కొత్తరకమైన ల్యాప్ టాప్. ట్యాబ్‌ కన్నా కాస్త పెద్ద సైజులో ఈ ల్యాప్‌టాప్ ఉంటుంది. అయితే అన్ని కంప్యూటర్ల లాగా.. దీనికి స్క్రీన్ అసలే ఉండదు. మరి ఎలా ఈ ల్యాప్‌టాప్‌ను వాడటం అని అనుకుంటున్నారా! ఈ ల్యాప్‌టాప్‌కు ఫిజికల్ స్క్రీన్‌ను తొలగించి.. వర్చువల్ స్క్రీన్ కనిపించేలా అత్యాధునిక టెక్నాలజీతో నిర్మాణం చేశారు. కళ్ళకి గ్లాసెస్ పెట్టుకోవడం ద్వారా స్క్రీన్‌ని చూడచ్చు. దాదాపు 100 అంగుళాల వరకూ స్క్రీన్‌ను పెంచుకోవచ్చు.

Spacetop-G1: ఈ ల్యాప్‌టాప్‌‌కు స్క్రీన్ ఉండదు.. ఎలా పని చేయాలంటే?
Spacetop-G1

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 12: కంప్యూటర్ వచ్చాక అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. శరవేగంగా ఐటీ అభివృద్ధి జరిగింది. అటు విద్య, వైద్యం ఇలా అన్ని రంగాల్లో కంప్యూటర్‌ని వాడాల్సిందే. ఇక కంప్యూటర్ వాడేవారికి సింపుల్‌గా యాక్సెస్ చేసుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ వస్తూనే ఉన్నాయి. మొదట డెస్క్ టాప్‌ను కొన్నేళ్లు వాడినా.. తర్వాత ల్యాప్‌టాప్ అందుబాటులోకి వచ్చింది. మరింత స్లిమ్‌గా ఇప్పుడు అనేక మూడేళ్ళు అందుబాటులో ఉన్నాయి. టెక్నాలజీ రయ్యి రయ్యి మని పరిగెత్తినట్లే.. కంప్యూటర్ల వాడకంలో అనేక మార్పులు ఇచ్చారు. ఇప్పుడు మరోరకం సూపర్ కంప్యూటర్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది.


స్పేస్‌టాప్‌-జీ1 కంప్యూటర్ మోడల్ ఒక కొత్తరకమైన ల్యాప్ టాప్. ట్యాబ్‌ కన్నా కాస్త పెద్ద సైజులో ఈ ల్యాప్‌టాప్ ఉంటుంది. అయితే అన్ని కంప్యూటర్ల లాగా.. దీనికి స్క్రీన్ అసలే ఉండదు. మరి ఎలా ఈ ల్యాప్‌టాప్‌ను వాడటం అని అనుకుంటున్నారా! ఈ ల్యాప్‌టాప్‌కు ఫిజికల్ స్క్రీన్‌ను తొలగించి.. వర్చువల్ స్క్రీన్ కనిపించేలా అత్యాధునిక టెక్నాలజీతో నిర్మాణం చేశారు. కళ్ళకి గ్లాసెస్ పెట్టుకోవడం ద్వారా స్క్రీన్‌ని చూడచ్చు. దాదాపు 100 అంగుళాల వరకూ స్క్రీన్‌ను పెంచుకోవచ్చు. అంతేకాదు ఒకసారి ఒకేసారి నాలుగైదు వర్చువల్‌ స్క్రీన్లని సృష్టించుకుని, వేరు వేరు ట్యాబుల్లో పనిచేసుకునే వీలు కల్పించారు. ఈ ల్యాప్‌టాప్‌ను ఎక్కడికంటే అక్కడికి పట్టుకొని తీసుకెళ్లవచ్చు. పని చేస్తున్న సమయంలో తమకు ఇతరులెవరూ కనబడరు. దీంతో కేవలం వర్క్ పైనే దృష్టిపెట్టి చక్కగా పనిచేసుకోవచ్చు.


ఇవి కూడా చదవండి:

Tiger vs Cobra: పాము అంటే పులికీ భయమే.. ఎలా వెనకడుగు వేసిందో చూడండి..

Elderly Woman Weeps: రావి చెట్టు ముందు వెక్కి వెక్కి ఏడ్చిన మహిళ.. కారణం ఏంటంటే..

Updated Date - Oct 12 , 2025 | 05:05 PM