Snake swallows knife: కత్తిని మింగిన పాము.. తర్వాత ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Jun 11 , 2025 | 07:39 AM
Snake swallows knife: కర్నాటక రాష్ట్రంలోని హెగ్డే గ్రామంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ నాగుపాము 12 అంగుళాల కత్తిని మింగేసింది.. పాము కత్తిని మింగడం ఏంటని ఆశ్చర్య పోకండి.. మీరు చదువుతున్నది నిజమే. తర్వాత ఏం జరిగిందంటే..

Karnataka: పాములకు (Snakes) సంబంధించిన వీడియోలు (Videos) ప్రతిరోజూ సోషల్ మీడియా (Social Media)లో వైరల్ (Viral) అవుతూ ఉంటాయి. ఆడవుల (Forest_ నుంచి వచ్చిన పాములు జనావాసాల్లో సంచారం చేస్తుంటాయి. ఈ క్రమంలో చాలా వరకు పాములు చనిపోతుంటాయి. ఎందుకంటే ఎక్కడ తమను కాటు వేస్తాయోనని జనాలు వాటిని చంపేస్తారు. కొంతమంది వాటిని రక్షించి దూరప్రాంతాల్లో విడిచిపెడతారు. తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
కర్నాటక రాష్ట్రంలోని హెగ్డే గ్రామంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ నాగుపాము 12 అంగుళాల కత్తిని మింగేసింది. పాము కత్తిని మింగడం ఏంటని ఆశ్చర్య పోకండి.. మీరు చదువుతున్నది నిజమే. గణపతి నాయక్ అనే వ్యక్తి ఇంటి బయట ఉన్న కత్తిని పాము మింగింది. అయితే కత్తి పిడి భాగం బయటే ఉంది. దీంతో పాము కత్తిని పూర్తిగా మింగలేక.. కక్కలేక.. ముందుకు కదల్లేక నరకయాతన అనుభవించింది. దీనిని గమనించిన ఆ కుటుంబ సభ్యులు సమీపంలో ఉన్న వెటర్నరీ వైద్యుడు భట్‌కు సమాచారం అందించారు. అలాగే స్నేక్ క్యాచర్ కూడా సమాచారమిచ్చారు. దీంతో వైద్యుడు, స్నేక్ క్యాచర్ సంఘటన ప్రదేశానికి చేరుకుని పామును పట్టుకున్నారు. పాము నోట్లో నుంచి డాక్టర్ కత్తిని బయటకు తీశారు.
కత్తి తీసిన తర్వాత నాగుపాము ఊపిరి పోసుకుంది. ఊపిరితో ఉన్న ఆ నాగుపామును స్నేక్ క్యాచర్, డాక్టర్ కలిసి సమీప అడవిలో విడిచిపెట్టారు. నెమ్మదిగా నాగుపాము అడవుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసినవారు ఆశ్చర్యపోయారు. పామును రెస్క్యూ చేసి కాపాడినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
ఇవి కూడా చదవండి:
అంతర్జాతీయ టెర్రరిజానికి తండ్రి పాకిస్థాన్...
For More AP News and Telugu News