Snake Catcher: మెడలో పామును పెట్టుకుని బైక్ డ్రైవింగ్.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..
ABN , Publish Date - Jul 19 , 2025 | 07:20 AM
పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా జంకుతారు. అలాంటిది విషపూరిత సర్పాల జోలికి వెళ్తే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే కొందరు వ్యక్తులు పాములతో చాలా ధైర్యంగా వ్యవహరిస్తారు. ఇళ్లలోకి, జనావాసాల్లోకి వచ్చిన పాములను పట్టుకుని కాపాడుతుంటారు.

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే (Snakes) భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా జంకుతారు. అలాంటిది విషపూరిత సర్పాల జోలికి వెళ్తే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే కొందరు వ్యక్తులు పాములతో చాలా ధైర్యంగా వ్యవహరిస్తారు. ఇళ్లలోకి, జనావాసాల్లోకి వచ్చిన పాములను పట్టుకుని కాపాడుతుంటారు. తాజాగా అలాంటి ఓ స్నేక్ క్యాచర్ (Snake Catcher dies) పాము కాటుకే బలై ప్రాణాలు కోల్పోయాడు.
మధ్యప్రదేశ్‌లోని రాఘోగఢ్‌కు సమీపంలో మొహల్లా ప్రాంతానికి చెందిన దీపక్ మహాబర్ ఓ స్నేక్ క్యాచర్. ఇప్పటివరకు కొన్ని వందల పాములను పట్టుకున్నాడు. రెండ్రోజుల క్రితం బర్బత్‌పురాలోని ఒక ఇంట్లోకి పాము వచ్చిందని దీపక్ మహాబర్‌కు సమాచారం అందింది. దీపక్ వెంటనే ఆ ఇంటికి చేరుకుని ఆ పామును పట్టుకున్నాడు. అయితే ఆ పామును జాగ్రత్తగా ఓ సంచిలో పెట్టకుండా తన మెడ చుట్టూ వేసుకుని బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. నేరుగా ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో అతడి చేతి మీద పాము కాటేసింది.
వెంటనే అతడిని కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్యులు అతడికి చికిత్స చేశారు. పరిస్థితి మెరుగైనట్టు కనిపించడంతో దీపక్ ఇంటికి వెళ్లిపోయాడు. అయితే తర్వాతి రోజు ఉదయానికి పరిస్థితి విషమించి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం తర్వాత అతని మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు.
ఇవి కూడా చదవండి..
చిన్న పిల్లలకు వంటింటి చిట్కా.. ఎంత ప్రమాదకరం అంటే..
గర్ల్‌ఫ్రెండ్‌ను ఎత్తుకుని హాస్పిటల్‌కు తీసుకొచ్చిన యువకుడు.. తర్వాతేం జరిగిందో తెలిస్తే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..