Share News

UP Shocker: పెళ్లయిన పాతికేళ్ల తరువాత భర్తకు షాక్.. భార్య 25 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడటంతో..

ABN , Publish Date - Jul 21 , 2025 | 01:01 PM

పెళ్లయిన పాతికేళ్లకు ఓ వివాహిత తన బంధువైన 25 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. అతడితోనే ఉంటానని ఆమె తెగేసి చెప్పడంతో భర్త చేసేదేంలేక పక్కకు తప్పుకున్నాడు. యూపీలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది.

UP Shocker:  పెళ్లయిన పాతికేళ్ల తరువాత భర్తకు షాక్.. భార్య 25 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడటంతో..
UP Woman

ఇంటర్నెట్ డెస్క్: యూపీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పెళ్లయిన 25 ఏళ్ల తరువాత ఓ మహిళ తన బంధువైన 25 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. చివరకు ప్రేమ పాకాన పడటంతో భర్త, నలుగురు పిల్లలను వదిలిపెట్టి అతడితో వెళ్లిపోయింది. సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇటీవల వెలుగు చూసిన ఈ ఉదంతం స్థానికంగా సంచలనం కలిగిస్తోంది.

జిల్లాలోని భవానీగంజ్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో నివసించే ఓ వ్యక్తికి సుమారు 25 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. పెద్ద కుమార్తెకు 20 ఏళ్లు, రెండో కుమార్తెకు 18 ఏళ్లు కాగా 17, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు మగపిల్లలు కూడా ఉన్నారు. ఇక వ్యాపారం రీత్యా అతడు తరచూ ఇతర ప్రాంతాలకు వెళుతుండేవాడు. ఈ క్రమంలోనే మహిళ ఇంటికి ఆమె బంధువైన ఓ 25 ఏళ్ల యువకుడు వచ్చి వెళుతుండేవాడు. చివరకు ఈ పరిచయం వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.


ఆ తరువాత మహిళ అతడిని ఏకంగా వివాహం చేసుకుంది. భర్తను, పిల్లలను వదిలిపెట్టి యువకుడితో వెళ్లిపోయింది. ఈ క్రమంలో భర్త పోలీసులకు, గ్రామపెద్దలకు ఫిర్యాదు చేశాడు. కొంత కాలం తరువాత లవర్‌తో కలిసి తిరిగొచ్చిన మహిళ మళ్లీ భర్తతో కొంతకాలం ఉంది. ఈ లోపు ఆమె ప్రియుడు ఫిర్యాదు చేశాడు. తమకు పెళ్లైందని, కానీ ఆమె మాత్రం వెళ్లిపోయిందని పేర్కొన్నాడు. ఈ క్రమంలో యువకుడితో కలిసి మరోసారి వెళ్లిపోయిన మహిళ ఆదివారం గ్రామానికి తిరిగొచ్చి పంచాయితీ పెట్టింది. తను ప్రియుడితోనే ఉంటానని, తమకు పెళ్లి కూడా అయ్యిందని చెప్పింది.

పోలీసులు, ఊరిపెద్దల సమక్షంలో జరిగిన ఈ పంచాయితీలో భర్త చివరకు రాజీపడ్డాడు. భార్య ప్రేమ వ్యవహారంపై తనకే అభ్యంతరం లేదంటూ పక్కకు తప్పుకున్నాడు. దీంతో, వివాదానికి తెర పడింది. తాను ప్రియుడితోనే ఉంటానని మహిళ స్పష్టం చేసిందని పోలీసులు తెలిపారు. దీంతో, చేసేదేం లేక వారిని పంపించేశామని అన్నారు. ఇక ఈ ఉదంతం స్థానికంగా పెను కలకలానికి దారి తీసింది.


ఇవీ చదవండి:

రైల్లో చిరు వ్యాపారి నుంచి జ్యూస్ ప్యాకెట్ చోరీ.. ఏం సంస్కారం రా నాయనా..

క్యాన్సర్‌తో మరణం అంచున యువతి.. మిగిలిన టైంలో ఏం చేయాలో చెప్పాలంటూ పోస్టు

Read Latest and Viral News

Updated Date - Jul 21 , 2025 | 01:56 PM