Nursery school fees: ఏబీసీడీలు నేర్చుకోవడానికి ఇంత ఫీజ్ కట్టాలా? ఆస్తులు అమ్ముకోవాల్సిందే..
ABN , Publish Date - Jul 31 , 2025 | 03:52 PM
ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందిస్తున్నప్పటికీ.. అక్కడి సౌకర్యాలు, సిబ్బంది పనితీరు, నాణ్యతపై ప్రజలకు విశ్వాసం లేదు. దీంతో తమ పిల్లల చదువు కోసం వేలకు వేలు ఖర్చుపెడుతూ ప్రైవేట్ విద్యా సంస్థలను ఆశ్రయిస్తుంటారు.

ప్రతి ఒక్కరికీ విద్య (Education), వైద్యం (Health) అనేవి అత్యవసరం. అయితే మన దేశంలో ఈ రెండూ రోజురోజుకూ అత్యంత ఖరీదుగా మారిపోతున్నాయి. ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందిస్తున్నప్పటికీ.. అక్కడి సౌకర్యాలు, సిబ్బంది పనితీరు, నాణ్యతపై ప్రజలకు విశ్వాసం లేదు. దీంతో తమ పిల్లల చదువు కోసం వేలకు వేలు ఖర్చుపెడుతూ ప్రైవేట్ విద్యా సంస్థలను ఆశ్రయిస్తుంటారు. ప్రజలను బలహీనతను క్యాష్ చేసుకునేందుకు కొందరు భారీ ఫీజులు వసూలు చేస్తున్నారు (Nursery school fees).
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నర్సరీ స్కూలు ఫీజ్ బిల్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. @talk2anuradha అనే ఎక్స్ యూజర్ ఈ స్కూల్ ఫీజు రిసీప్ట్‌ను షేర్ చేశారు. ఆ స్కూలు ఫీజులు చూస్తే షాకవ్వాల్సిందే. ఎందుకంటే ఆ స్కూలులో నర్సరీ చదవాలంటే రూ. 2,51,00 కట్టాలి. ఎల్‌కేజీ, యూకేజీలు చదవాలంటే రూ. 2,72,400 చెల్లించాల్సిందే. ఇక, 1, 2 తరగతులకు అయితే రూ. 2,91,460 కట్టాలి. ఈ ఫీజ్ రిసీప్ట్ షేర్ చేసిన యూజర్.. 'ఈ స్కూలులో ఏబీసీడీలు నేర్చుకోవాలంటే నెలకు రూ. 21,000 కట్టాలి. ఇంత భారీ ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లు పిల్లలకు ఏం చెబుతున్నాయి' అని ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌ను 18 లక్షల మందికి పైగా వీక్షించారు. 21 వేల మందికి పైగా ఈ పోస్ట్‌ను లైక్ చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ప్రభుత్వం విద్యకు సంబంధించి ఏమైనా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఒకరు కామెంట్ చేశారు. పిల్లలను చదివించడం కోసం అప్పులు పాలవుతున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మీది డేగ చూపు అయితే.. ఈ చింపాంజీ కళ్లజోడు ఎక్కడుందో 5 సెకెన్లలో కనుక్కోండి..
మీ పిల్లలు ఎక్కువగా మొబైల్ చూస్తున్నారా? ఈ ట్రిక్ ఉపయోగించి చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..