Share News

Megastar Chiranjeevi: అయ్యప్ప మాల వేసుకున్న మెగాస్టార్

ABN , Publish Date - Oct 23 , 2025 | 05:09 PM

మెగాస్టార్ చిరంజీవి అయ్యప్ప స్వామి మాలధారణ చేశారు. తాజాగా మెగాస్టార్ ఒక ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌కి తన భార్య సురేఖతో కలిసి హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో ఆయన అయ్యప్ప మాలలో కనిపించారు.

Megastar Chiranjeevi: అయ్యప్ప మాల వేసుకున్న మెగాస్టార్
Megastar Chiranjeevi

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 23: మెగాస్టార్ చిరంజీవి అయ్యప్ప స్వామి మాలధారణ చేశారు. తాజాగా మెగాస్టార్ ఒక ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌కి తన భార్య సురేఖతో కలిసి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ఆయన అయ్యప్ప మాలలో కనిపించారు. దీపావళి రోజు జరిగిన ఉపాసన సీమంతం వేడుకల్లో చిరు మాలధారణ చేయలేదు. అప్పుడు సాధారణ దుస్తుల్లోనే కనిపించారు. అంటే దీపావళి తర్వాత ఆయన స్వామివారి మాల వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మెగాస్టార్ తనయుడు, హీరో రామ్ చరణ్ కూడా ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాలధారణ చేస్తూ ఉంటారు.


ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు’ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా నయనతార నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిరు సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ వ‌చ్చే సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి రానుంది. అనీల్‌కు మెగాస్టార్ చిరంజీవి తోడ‌వ‌డంతో ఈ మూవీలో చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, మాస్ అప్పీల్ ఎలా ఉంటుంద‌నే ఆస‌క్తి నెల‌కొంది.


ఇవి కూడా చదవండి:

CM Chandrababu Heavy Rains: భారీ వర్షాలు.. అత్యవసర నిధుల మంజూరుకు సీఎం ఆదేశం

TG Govt On Sub Registrars: గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Updated Date - Oct 23 , 2025 | 06:26 PM