Viral Video: ఒట్టి చేతులతో చిరుతపులితో పోరాటం..
ABN , Publish Date - Jun 26 , 2025 | 03:04 PM
Viral Video: అరటి తోటలోకి వెళ్లిన తర్వాత ఆ వ్యక్తి చిరుత నుంచి తప్పించుకున్నాడు. జనాల దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిరుత మాత్రం తోటలోనే ఉండిపోయింది. చిరుత గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం వెళ్లింది.

తనపై దాడికి దిగిన చిరుతపులితో ఓ యువకుడు యుద్ధం చేశాడు. ఒట్టి చేతులతో దాన్ని మట్టి కరిపించాడు. రక్తం పారుతున్నా కూడా వదలకుండా దానితో పోరాటం చేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో సోమవారం చోటుచేసుకుంది. అటవీ శాఖ అధికారుల కథనం ప్రకారం.. ఉత్తర ప్రదేశ్, లఖీమ్ పుర్ ఖేరీ జిల్లా గిరిధరీ పూర్వ గ్రామానికి చెందిన 35 ఏళ్ల మిహీలాల్ అక్కడి ఇటుకల బట్టీలో పని చేస్తున్నాడు. రోజులాగే సోమవారం కూడా ఇటుకల తయారీలో నిమగ్నమై ఉన్నాడు. అతడికి కొంత దూరంలో మరికొంత మంది పని చేస్తున్నారు. ఇటుకల బట్టీలోని చిమ్నీలో ఓ చిరుతపులి దాక్కుని ఉంది. ఆ విషయం తెలియని మిహీలాల్ ఇటుకల బట్టీ దగ్గరకు వెళ్లాడు. లోపల నక్కి ఉన్న చిరుతపులి అతడ్ని చూసింది. బయటకు ఠక్కున వచ్చింది.
మిహీలాల్‌పై దాడి చేయటం మొదలెట్టింది. అయితే, చిరుతను చూసి అతడు భయపడలేదు. ఒట్టి చేతుల్తో దాంతో పోరాటం చేయటం మొదలెట్టాడు. మిహీలాల్‌పై చిరుత దాడి గురించి కొద్దిసేపటికే పక్కన ఉన్న వాళ్లకు తెలిసిపోయింది. వెంటనే అతడికి సాయం చేయడానికి రంగంలోకి దిగారు. ఇటుకలతో పులిపై దాడి చేశారు. అయినా ఆ చిరుత అతడ్ని విడిచిపెట్టలేదు. కొన్ని నిమిషాల పాటు పోరు నడిచింది. ఆ తర్వాత చిరుత నుంచి తప్పించుకున్న మిహీలాల్ అరటి తోట వైపు పరుగులు తీశాడు. చిరుత కూడా అతడిని వెంబడించింది.
అరటి తోటలోకి వెళ్లిన తర్వాత ఆ వ్యక్తి చిరుత నుంచి తప్పించుకున్నాడు. జనాల దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిరుత మాత్రం తోటలోనే ఉండిపోయింది. చిరుత గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం వెళ్లింది. వారు హుటాహుటిన అరటి తోట దగ్గరకు వచ్చారు. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆ చిరుత అటవీ శాఖ వారిపై కూడా దాడి చేసింది. ఫారెస్ట్ రేంజర్ కుమార్ దీక్షిత్, రేంజర్ న్రిపేంద్ర చతుర్వేది, పోలీస్ అధికారి రామ్ సజివాన్, గ్రామస్తుడు ఇక్బాల్ ఖాన్ చిరుత దాడిలో గాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
వామ్మో.. నూడిల్స్ తింటే ఇంత ప్రమాదమా.. నూడిల్స్ ప్యాకెట్ మీద ఏం రాసి ఉందంటే..
మీ కళ్లకు పవర్ ఉంటే.. జిరాఫీల మధ్యనున్న పామును 5 సెకెన్లలో కనిపెట్టండి