Share News

Pushpa 2: పుష్ఫ సినిమా పాటకు మాజీ ముఖ్యమంత్రి భార్య డ్యాన్స్

ABN , Publish Date - Apr 19 , 2025 | 09:02 AM

Kejriwal Wife Dance To Pushpa 2 Song: మాజీ ముఖ్యమంత్రి భార్య పుష్ఫ 2 సినిమాలో ‘ అంగారో కా అంబర్ సా’ పాట(ఇదే తెలుగులో చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి)కు డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Pushpa 2: పుష్ఫ సినిమా పాటకు మాజీ ముఖ్యమంత్రి భార్య డ్యాన్స్
Kejriwal Wife Dance To Pushpa 2 Song

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 1,2 సినిమాలు దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా రెండు సినిమాల్లోని పాటలకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. పుష్ఫ ది రైజింగ్ సినిమాలో సమంత ఐటెమ్ సాంగ్ పాట ‘ ఊ అంటావా.. మామ .. ఊఊ అంటావా మామ’ అయితే ఓ ఊపు ఊపింది. పెద్ద పెద్ద కోటీశ్వరుల ఇళ్లలో ఫంక్షన్‌లలో ఈ పాటకు డ్యాన్స్ వేశారు. పుష్ఫ 2 సినిమాలో శ్రీలీల చేసిన ఐటమ్ సాంగ్‌కు అంతగా గుర్తింపు రాలేదు. కానీ, మిగిలిన పాటలకు నార్త్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది.


తాజాగా, ఓ మాజీ ముఖ్యమంత్రి భార్య ఓ ఫంక్షన్‌లో పుష్ఫ 2 సినిమాలోని ‘చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ పాటకు డ్యాన్స్ వేశారు. ఆ ముఖ్యమంత్రి ఎవరో కాదు.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రివాల్. గురువారం కేజ్రివాల్ కూతురు ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్లో కేజ్రివాల్ భార్య సునీత పుష్ఫ 2 సినిమాలో ‘ అంగారో కా అంబర్ సా’ పాట(ఇదే తెలుగులో చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి)కు డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ప్రియుడితో కేజ్రివాల్ కూతురి పెళ్లి

కేజ్రివాల్ కూతురు హర్షిత కేజ్రివాల్ ఢిల్లీలోని ఐఐటీలో చదివారు. అక్కడే సంభవ్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా తర్వాత ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి ఇద్దరూ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. గురువారం ఇద్దరికీ నిశ్చతార్థం జరిగింది. నిన్న.. శుక్రవారం రోజున మూడు ముళ్ల బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వేడుకకు ప్రముఖులు పలువురు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు.


ఇవి కూడా చదవండి

ఇదేం బుద్ధి తల్లి.. అన్న వరుసయ్యే వ్యక్తితో మహిళ జంప్

Lady Don: లేడీ డాన్ కళ్లముందే హత్య.. ఆమె బుద్ధే మంచిది కాదు..

Updated Date - Apr 19 , 2025 | 09:33 AM