Milk Delivery on Audi Car: పాలు అమ్ముకోవడానికి ఏకంగా బ్యాంక్ జాబునే వదిలేశాడు..
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:37 PM
Delivering Milk In An Audi Car: అయితే.. బ్యాంకు ఉద్యోగంలో అడుగుపెట్టిన తర్వాత అంతా మారిపోయింది. 10 టు 6 పనితో అతడు విసిగిపోయాడు. వాహనాలపై ఉన్న అతడి ప్రేమను ఆ ఉద్యోగం తొక్కి పడేసింది. దీంతో అతడు తట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగం మానేయాలనుకున్నాడు.

మీరు ఉద్యోగం చేస్తున్నారా? ఒక సారి మీ గుండెల మీద చెయ్యి వేసుకుని మీకు మీరు చెప్పుకోండి. ప్యాషన్ కోసం పని చేస్తున్నారా? పైసల కోసం పని చేస్తున్నారా?.. నూటికి 99 శాతం మంది పైసల కోసమే ఇష్టం లేని అడ్డమైన గాడిద చాకిరి పనులు చేస్తూ ఉంటారు. వారి మనసులో ఇదే లాస్టు రోజు అన్నట్లుగా ఓ అసహనం ఉంటుంది. చాలా మంది రిజైన్ లెటర్ జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఈ 99 శాతం మందిలో ఒక శాతం మంది తెగువ చూపిస్తున్నారు. తమ ఫ్యాషన్‌ను ఫాలో అవ్వడానికి ఇష్టం లేని జాబుల్ని వదిలేస్తున్నారు. ఇష్టమైన పనిలో కష్టాన్ని మర్చిపోయి ముందుకు సాగుతున్నారు.
తాజాగా, హర్యానాకు చెందిన ఓ యువకుడు తన ఫ్యాషన్‌ను ఫాలో అవ్వడానికి ఏకంగా బ్యాంకు జాబునే వదిలేశాడు. కాలు మీద కాలు వేసుకుని, ఏసీలో కూర్చుని లక్షల జీతం తీసుకునే వాడు.. ప్రస్తుతం పాలు అమ్ముకుంటున్నాడు. అది కూడా ఆడీ, హార్లీ డేవిడ్ సన్ లాంటి అత్యంత ఖరీదైన వాహనాల్లో పాలు అమ్ముకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. హర్యానా, ఫరీదాబాద్‌లోని మొహబ్బతాబాద్‌కు చెందిన అమిత్ బందన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత బ్యాంకు జాబ్ సాధించాడు. అతడికి చిన్నప్పటినుంచి ఖరీదైన కార్లు, బైకులు అంటే చాలా ఇష్టం.
వాటిలోనే తన ఫ్యాషన్‌ను వెతుక్కుందాం అనుకున్నాడు. అయితే.. బ్యాంకు ఉద్యోగంలో అడుగుపెట్టిన తర్వాత అంతా మారిపోయింది. 10 టు 6 పనితో అతడు విసిగిపోయాడు. వాహనాలపై ఉన్న అతడి ప్రేమను ఆ ఉద్యోగం తొక్కి పడేసింది. దీంతో అతడు తట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగం మానేయాలనుకున్నాడు. అమిత్ కుటుంబానికి పాల వ్యాపారం ఉంది. ఆ పాల వ్యాపారాన్ని ఖరీదైన వాహనాలతో కలిపి కొత్త ట్రెండ్‌కు తెరతీశాడు. అంతా ఓకే అనుకున్నాక .. జాబ్ మానేశాడు. ఖరీదైన ఆడీ కారు, హార్లీ డేవిడ్ సన్ బైకుల్లో పాలను అమ్ముతున్నాడు. కొద్దిరోజులకే అతడి వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం అమిత్ ఖరీదైన వాహనాల్లో పాలు తీసుకెళుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి
Live In Partner: పదేళ్ల సహజీవనం.. బెడ్డు కింద ప్రియురాలి శవం..
Hanuman Garhi: 300 ఏళ్ల ఆచారానికి బ్రేక్.. రాముడి దగ్గరకు హనుమాన్ భక్తుడు