Share News

ఇదో ఫేక్‌ పెళ్లి.. అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌, ఎంజాయ్‌

ABN , Publish Date - Aug 03 , 2025 | 01:46 PM

ట్రెడిషనల్‌ వెడ్డింగ్‌, డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ తెలుసు... కానీ ఇటీవల కాలంలో సోషల్‌మీడియాలో బాగా వైరల్‌ అవుతోన్న కొత్తరకం పెళ్లి ‘ఫేక్‌ వెడ్డింగ్‌’. ఈ పెళ్లిలో మండపం, డెకరేషన్‌, బాజాభజంత్రీలు, డీజే, హల్దీ, సంగీత్‌, ఫొటోషూట్‌, బరాత్‌, మిరుమిట్లు గొలిపే బాణసంచా, భోజనాలు... ఇలా అన్నీ ఉంటాయి. కాకపోతే ఒకే ఒక్క తేడా ఏమిటంటే... పెళ్లికొడుకు, పెళ్లికూతురు మాత్రం ఉండరు.

ఇదో ఫేక్‌ పెళ్లి.. అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌, ఎంజాయ్‌

ట్రెడిషనల్‌ వెడ్డింగ్‌, డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ తెలుసు... కానీ ఇటీవల కాలంలో సోషల్‌మీడియాలో బాగా వైరల్‌ అవుతోన్న కొత్తరకం పెళ్లి ‘ఫేక్‌ వెడ్డింగ్‌’. ఈ పెళ్లిలో మండపం, డెకరేషన్‌, బాజాభజంత్రీలు, డీజే, హల్దీ, సంగీత్‌, ఫొటోషూట్‌, బరాత్‌, మిరుమిట్లు గొలిపే బాణసంచా, భోజనాలు... ఇలా అన్నీ ఉంటాయి. కాకపోతే ఒకే ఒక్క తేడా ఏమిటంటే... పెళ్లికొడుకు, పెళ్లికూతురు మాత్రం ఉండరు.

అవును... 1499 రూపాయల ఎంట్రీ టికెట్‌ కొనుక్కోని, చక్కగా సాంప్రదాయ దుస్తుల్లో ఈ ఫేక్‌ వెడ్డింగ్‌కి హాజరైతే... పెళ్లి వేడుకను సరదాగా ఎక్స్‌పీరియన్స్‌ చేయొచ్చు. మిగతా హంగులు, ఏర్పాట్లన్నీ.. నిర్వాహకులే చూసుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది కూడా ఒక ఈవెంట్‌లాంటిదే. అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌, అన్‌లిమిటెడ్‌ ఎంజాయ్‌మెంట్‌కు ఈ మధ్య కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోతున్నాయి ఈ సరికొత్త ‘ఫేక్‌ వెడ్డింగ్స్‌’.

వర్క్‌లైఫ్‌లో బాగా బిజీ అయిపోయి, ఒత్తిడిగా ఫీలవుతున్నవారికి కూసింత ఉపశమనం కల్పించడమే వీటి ప్రధాన ఉద్దేశం. ఎంత ఒత్తిడిలో ఉన్నాసరే... ఒక్కసారి ఈ ఫేక్‌ వెడ్డింగ్‌కి అటెండ్‌ అయ్యారంటే... పెళ్లి వేడుకల్లో పాల్గొంటూ, అక్కడ ఉన్న కాసేపు తనివితీరా ఎంజాయ్‌ చేయొచ్చు. ఇప్పటికే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, పుణే వంటి నగరాల్లో ఈ ట్రెండ్‌ బాగా ఊపందుకుంది. త్వరలోనే మన దగ్గరా మొదలవ్వొచ్చు.

Updated Date - Aug 03 , 2025 | 01:46 PM