Share News

Central And State Govt Jobs: ఓసీలకు జాక్‌పాట్.. ఇలా చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్..

ABN , Publish Date - Nov 30 , 2025 | 11:13 AM

అగ్రవర్ణాలకు చెందిన యువతలో చాలా మంది ఇప్పటికే చదువు పూర్తి చేశారు. వారు.. సులువుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Central And State Govt Jobs: ఓసీలకు జాక్‌పాట్.. ఇలా చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్..

అగ్రవర్ణాల్లోని పేదలకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించింది. మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని చాలా ఏళ్లు అయింది. దాంతో అగ్రవర్ణాల్లోని సామాజిక వర్గాలకు చెందిన పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఇటీవల ఈడబ్ల్యూఎస్ (EWS Reservation) కింద రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రిజర్వేషన్లు ఇప్పటికే అమలవుతున్నాయి. ఈ ప్రభుత్వ ఉత్తర్వులతో ఇకపై కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాల్లోనూ ఈ రిజర్వేషన్ల వర్తించనున్నాయి.

తహసీల్దార్ కార్యాలయల్లో ఈ సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని రకాల ప్రవేశ పరీక్షలతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. దాంతో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల సర్టిఫికెట్లకు ప్రాధాన్యత మరింత పెరిగింది. అందుకు అర్హులైన వారు ఈ సర్టిఫికేట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే కొంతమందికి ఈ సర్టిఫికేట్ల ఎలా దరఖాస్తు చేయాలనే దానిపై అనేక సందేహాలు నెలకొన్నాయి. వారి కోసం..


ఈ అర్హతలు ఉండాలి..

కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణాల పేదలు ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్‌ పొందేందుకు అర్హులు. తొలుత మీ సేవా కేంద్రాలు లేదా గ్రామ, వార్డు సచివాలయాల్లో పేరు నమోదు చేసుకోవాలి.


ఇవి కావాలి..

రేషన్ కార్డు, ఏడాదికి రూ. 8 లక్షల లోపు ఆదాయం ఉన్నట్లు బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్, ఆదాయపు పన్ను వివరాలతో అఫిడవిట్, ఫోటో జత చేయాలి. చిరునామా కోసం ఆధార్ కార్డు, టీసీ, బర్త్ సర్టిఫికెట్లలో ఏదో ఒకదానితో పాటు ఫోటో కూడా ఇవ్వాల్సి ఉంటుంది.


ఇవి ఉంటే అనర్హులు..

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. 5 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి, పట్టణాల్లో 100 చదరపు గజాలు, ఇతర ప్రాంతాల్లో 200 చదరపు గజాల కంటే ఎక్కువ ఇంటి స్థలం. గ్రామాల్లో 1000 గజాల కంటే ఎక్కువ ఇంటి స్థలం ఉంటే.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు అనర్హులు.


కుటుంబానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ ధృవీకరిస్తూ న్యాయవాది ద్వారా నోటరీ అఫిడవిట్‌తోపాటు కుటుంబ సభ్యుల వాంగ్మూలంతో కూడిన దరఖాస్తును తహసీల్దార్ కార్యాలయంలో అందజేయల్సి ఉంటుంది. ఒక వేళ.. దరఖాస్తు చేసుకునే వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడ స్థిరపడితే.. సొంత మండలం నుంచి వలస వచ్చినట్లు ధృవీకరణ పత్రం తెచ్చుకుని తహసీల్దార్‌కు అందజేయాలి. దరఖాస్తుతోపాటు ఫీజు చెల్లిస్తే 30 రోజుల్లో.. అది కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. వీఆర్వో, ఆర్ఐ తన విచారణ నివేదికతో తహసీల్దారుకు ధృవీకరణ పత్రం కోసం సిఫార్సు చేస్తారు. అనంతరం దరఖాస్తు చేసుకున్న చోటే.. ధృవీకరణ పత్రం పొందవచ్చు. తద్వారా విద్యా సంస్థల్లో సీటు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందేందుకు వీలు పొందుతారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రెండో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

భోజనం తర్వాత ఇలా చేస్తే.. ఈ ప్రయోజనాలు..?

Read Latest TG News and National News

Updated Date - Nov 30 , 2025 | 11:29 AM