Duplicate locks: డూప్లికేట్ తాళాలు అందించే ఏటీఎంలు వచ్చేశాయ్...
ABN , Publish Date - Nov 02 , 2025 | 01:44 PM
డబ్బులొచ్చే ఏటీఎం, బంగారం వచ్చే ఏటీఎంలు చూశాం... పిజ్జా, పాలు అందించే వెండింగ్ మెషీన్ల గురించి విన్నాం. అక్కడితో ఆగలేదు... ఇప్పుడు డూప్లికేట్ తాళాలు అందించే ఏటీఎంలు వచ్చేశాయి.
డబ్బులొచ్చే ఏటీఎం, బంగారం వచ్చే ఏటీఎంలు చూశాం... పిజ్జా, పాలు అందించే వెండింగ్ మెషీన్ల గురించి విన్నాం. అక్కడితో ఆగలేదు... ఇప్పుడు డూప్లికేట్ తాళాలు అందించే ఏటీఎంలు వచ్చేశాయి.
సాధారణంగా ఇళ్లలో ప్రతీ దానికి రెండేసి తాళం చెవులు ఉంటాయి. ఒకటి వాడుతూ... ఇంకోటి భద్రపరుస్తాం. ఒకవేళ తాళం చెవి పోగొట్టుకుంటే, వెంటనే డూప్లికేట్ తాళం కోసం... తాళాలు తయారుచేసే కుర్రాడి దగ్గరకి వెళ్తాం. అయితే అలాంటి శ్రమ లేకుండా క్షణాల్లో డూప్లికేట్ తాళాన్ని అందించే మెషీన్ ఇది. అయితే మన దగ్గర కాదులెండి.. అమెరికాలో.
మొదట దీని స్ర్కీన్‌పై కనిపించే స్టార్ట్ బటన్‌ని టచ్ చేయగానే, రకరకాల తాళాల ఆప్షను ్ల(ఇంటి తాళం, బీరువా తాళం, వాహనాల తాళం మొదలై నవి) కనిపిస్తాయి. అవసరమైన దాన్ని ఎంచుకుని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఆపై మన దగ్గరున్న స్పేర్ తాళం చెవిని బాక్స్‌లో ఇన్‌సెర్ట్ చేస్తే... మెషీన్ స్కాన్ చేసుకుంటుంది. తర్వాత ఎన్ని తాళంచెవులు కావాలో నంబర్ ఎంటర్ చేసి, రుసుము చెల్లిస్తే... క్షణాల్లో డూప్లికేట్ తాళాలు కళ్ల ముందుంటాయి. సదరు వీడియోను తన్వీర్ షేక్ అనే వ్యక్తి ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో... ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ యంత్రంపై నెటిజన్లు సరదాగా చాలా సెటైర్లే వేస్తున్నారు.