Share News

Cockroach coffee: చచ్చిన బొద్దింకలు, కీటకాలు.. ఈ స్పెషల్ కాఫీ ధర ఎంతో తెలిస్తే షాక్..

ABN , Publish Date - Nov 24 , 2025 | 02:42 PM

బొద్దింకలు, కీటకాల ఆవశేషాలతో కూడిన కాఫీని తాగేందుకు ఎవరైనా ఇష్టపడతారా? అలాంటి కాఫీ ఎక్కడ దొరుకుతుందని ఆశ్చర్యపోతున్నారా? చైనాలో ఈ విచిత్రమైన కాఫీ లభ్యమవుతోంది. దాని ఖరీదు ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే.

Cockroach coffee: చచ్చిన బొద్దింకలు, కీటకాలు.. ఈ స్పెషల్ కాఫీ ధర ఎంతో తెలిస్తే షాక్..
weird coffee ingredients

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కాఫీని ఇష్టంగా తాగుతారు. కాఫీ లేకపోతే చాలా మందికి రోజు గడవదు. కాఫీ ప్రియులు రకరకాల ఫ్లేవర్లతో తయారు చేసే కాఫీలు తాగేందుకు ఇష్టపడుతుంటారు. అయితే బొద్దింకలు, కీటకాల ఆవశేషాలతో కూడిన కాఫీని తాగేందుకు ఎవరైనా ఇష్టపడతారా? అలాంటి కాఫీ ఎక్కడ దొరుకుతుందని ఆశ్చర్యపోతున్నారా? చైనాలో ఈ విచిత్రమైన కాఫీ లభ్యమవుతోంది. దాని ఖరీదు ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే (Dead cockroach coffee).


బీజింగ్‌లోని కీటకాల మ్యూజియం ఈ విచిత్రమైన కాఫీని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ మ్యూజియంలోని కేఫ్ 'కాక్రోచ్ కాఫీ'ని విక్రయిస్తోంది. ఈ కాఫీని బొద్దింక పొడితో తయారు చేస్తారు. ఈ కాఫీ ధర దాదాపు 500 రూపాయలు. ఈ కాఫీ తయారు చేయడానికి, ముందుగా బొద్దింకలను ఎండబెడతారు. ఆ తరువాత వాటిని మెత్తని పొడిగా చేస్తారు. ఆ పొడితో కాఫీ తయారు చేస్తారు. కావాలంటే ఆ కాఫీపై కొన్ని చిన్న చిన్న కీటకాలను టాపింగ్‌గా ఇస్తారు. బొద్దింక పొడితో చేసే ఈ కాఫీ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు (insect dust coffee).


కాక్రోచ్ కాఫీ మాత్రమే కాదు.. బీజింగ్ మ్యూజియంలో పలు ఇతర కీటకాలతో చేసిన కాఫీలు కూడా దొరుకుతాయి (bizarre coffee trend). పిచర్ ప్లాంట్ కాఫీ, యాంట్ కాఫీ, పలు కీటకాల సారం నుంచి తయారు చేసిన కాఫీలు లభ్యమవుతాయి. కాగా, ఈ కాక్రోచ్ కాఫీ తాగిన కొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. 'ఈ కాఫీ నేను అనుకున్నంత అసహ్యంగా లేదు. కానీ, ఇకపై ఎప్పుడూ తాగను' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఆరోగ్యం రాకపోయినా ఫర్వాలేదు.. ఈ కాఫీ మాత్రం తాగను' అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

ఈ ఆంటీ తెలివికి సలాం కొట్టాల్సిందే.. వాషింగ్‌మెషిన్‌తో కోతులకు ఎలా చెక్ పెట్టిందో చూడండి..


ఐర్లాండ్ వాసులకు నిద్రలేకుండా చేసిన సింహం.. తీరా అసలు విషయం తెలిసి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 24 , 2025 | 02:42 PM