Share News

Shruti Haasan: పాపం శృతి హాసన్.. సీఎస్‌కే ఓటమిని తట్టుకోలేకపోయింది..

ABN , Publish Date - Apr 26 , 2025 | 03:56 PM

Shruti Haasan Breaks Down: శృతి హాసన్ బాధతట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎస్‌కే ఫ్యాన్స్ ఆ వీడియో చూసి బాధపడుతున్నారు. ఇక, ఇదే మ్యాచ్‌కు తల అజిత్ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లారు.

Shruti Haasan: పాపం శృతి హాసన్.. సీఎస్‌కే ఓటమిని తట్టుకోలేకపోయింది..
Shruti Haasan Breaks Down

ఐపీఎల్ 2025 రసవత్తరంగా సాగుతోంది. ఏప్రిల్ 25వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. చపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను చూడ్డానికి ప్రముఖ సినిమా సెలబ్రిటీలు పలువురు వెళ్లారు. వారిలో శృతి హాసన్ కూడా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో శృతి హాసన్ ఎమోషనల్ అయ్యారు. సీఎస్‌కే ఓడిపోయిందన్న బాధలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. మ్యాచ్ మొదలైనప్పుడు శృతి హాసన్ ఎంతో ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. మ్యాచ్ చివర్లో సీఎస్‌కేకు ఓటమి తప్పదని తెలిసినపుడు శృతి ముఖంలో ఆనందం మాయం అయింది.


ఎగ్జైట్‌మెంట్ కాస్తా యాంగ్జైటీగా మారిపోయింది. సీఎస్‌కే ఓడిపోగానే.. బాధతట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎస్‌కే ఫ్యాన్స్ ఆ వీడియో చూసి బాధపడుతున్నారు. ఇక, ఇదే మ్యాచ్‌కు తల అజిత్ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. అజిత్, శృతి హాసన్ ఇద్దరూ ఒకరికొకరు ఎదురు పడ్డారు. ఎంతో అప్యాయంగా పలకరించుకున్నారు. హగ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అజిత్ ఫ్యాన్స్ ఈ వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు.


శృతి సినిమా సంగతులు

శృతి హాసన్ చివరగా సలార్ సీజ్‌ఫైర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. అంతకు ముందు హాయ్ నాన్న సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న తమిళ సినిమాలు కూలీ, ట్రైన్, జననాయగన్ షూటింగ్ శరావేగంగా జరుపుకుంటున్నాయి. తెలుగులో ఆమె డెకాయిట్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె అడవి శేషుకు జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగు సినిమాలు ఏవీ లేవు. సలార్ శౌర్యాంగపర్వం అనౌన్స్ చేసినా.. షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించటం లేదు.


ఇవి కూడా చదవండి

పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..

Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్

Updated Date - Apr 26 , 2025 | 04:10 PM