Miracle At Puri: పూరీ జగన్నాథ్ ఆలయం ముందు మెరాకిల్.. కోమాలోనుంచి కళ్లు తెరిచిన బాలుడు
ABN , Publish Date - Nov 25 , 2025 | 06:13 PM
పూరీ జగన్నాథ్ ఆలయం ముందు ఓ అద్భుతం జరిగింది. తండ్రి ప్రార్థనలతో కోమాలతో ఉన్న బాలుడు కళ్లు తెరిచాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు అదంతా దేవుడి లీల అంటున్నారు.
ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయం దగ్గర ఓ అద్భుతం జరిగింది. కోమాలో ఉన్న ఓ బాలుడు తండ్రి ప్రార్థనలతో కళ్లు తెరిచాడు. పూరీ శ్రీమందిర్ దగ్గర ఈ మెరాకిల్ జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన ప్రకాష్ బోయ్ కుమారుడు నిఖిల్ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సంవత్సరం క్రితం కోమాలోకి వెళ్లాడు. అప్పటినుంచి అతడి పరిస్థితి దారుణంగానే ఉంది. కోమాలోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు.
ఆస్పత్రుల చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయింది. ప్రకాష్ పూరీ జగన్నాథుడి మీద భారం వేశాడు. నవంబర్ 8వ తేదీన కోమాలో ఉన్న కొడుకును ఆలయానికి తీసుకువచ్చాడు. పూరీ శ్రీమందిర్ దగ్గర నిఖిల్‌ను పడుకోబెట్టి ప్రార్థనలు చేయటం మొదలెట్టాడు. ప్రకాష్ ప్రార్థనలు ఫలించాయి. నిఖిల్ కళ్లు తెరిచాడు. కోమాలో ఉన్న కొడుకు కళ్లు తెరవటంతో ప్రకాష్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
ఇక, ఈ మెరాకిల్‌పై ప్రకాష్ స్పందిస్తూ.. ‘నేను ఆ పరమాత్ముడి మీదే భారం వేశాను. నా కుమారుడిలో చాలా మార్పులు వచ్చాయి. అతడికి చికిత్స చేయించటానికి నా దగ్గర డబ్బులు లేవు. పూరీ ఆలయ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తే నా కుమారుడికి చికిత్స చేయించుకుంటా. అందుకు ఎంతో రుణపడి ఉంటా’ అని అన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు అది దేవుడి లీల అంటూ ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ఏపీ-లింక్ ద్వారా లాజిస్టిక్స్ రంగంలో భారీ పెట్టుబడులు రావాలి: సీఎం చంద్రబాబు
వామ్మో.. అచ్చం అలాగే.. ఫేక్ ఆధార్, పాన్ కార్డులను తయారు చేస్తున్న ఏఐ..