Bride Saves Guest: పెళ్లికి వచ్చిన అతిథిని కాపాడిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్
ABN , Publish Date - Dec 04 , 2025 | 08:16 AM
తన పెళ్లికి వచ్చిన ఓ మహిళా అతిథిని పెళ్లి కూతురు కాపాడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని కోల్హాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఆ వధువుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ‘ దైవం మానుష రూపేణ ’.. అంటే దైవం ఎక్కడో లేదు.. 'మనిషి' రూపంలో మన దగ్గరే ఉందని అర్థం. అలానే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు దేవుడే మనిషి రూపంలో వచ్చి.. కాపాడినాడని అనిపిస్తుంది. వివిధ రకాల ప్రమాదాలు జరిగినప్పుడు సరైన సమయంలో వైద్యం అందక చాలా మంది చనిపోతుంటారు. మరికొన్ని సందర్భాల్లో ఎవరో ఒకరు సరైన టైమ్ లో వచ్చి.. చికిత్స అందించడం ద్వారా కొందరు ప్రాణాలతో బయటపడుతున్నారు. అచ్చం అలాంటి ఘటన మహారాష్ట(Maharashtra)లో చోటుచేసుకుంది. కొల్హాపూర్ జిల్లాలో ఓ గ్రామంలో తన పెళ్లికి వచ్చిన అతిథిని పెళ్లి కూతురు(Bride Saves Guest) రక్షించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Bride Viral Video) కావడంతో నవ వధువుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
కొల్హాపూర్(Kolhapur) జిల్లాలోని బండివాడేలో ఓ వివాహం జరిగింది. అయితే ఎంతో హాయిగా, సంతోషంగా జరుగుతున్న ఆ పెళ్లి.. అకస్మాత్తుగా గందరగోళంగా మారింది పెళ్లికి వచ్చిన ఓ మహిళా అతిథి తల తిరుగుతున్నట్లు అనిపించి వేదికపైనే అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ క్రమంలోనే వధువు వెంటనే స్పందించి.. వేదికపై ఉన్న మహిళకు చికిత్స చేసి ఆమెను బతికించింది. ఆ పెళ్లి కూతురు వైద్యురాలు కావడంతో ఇక విశేషం. వధువే డాక్టర్ కావడంతో అస్వస్థతకు గురైన మహిళలకు వెంటనే వైద్యం అందించింది.
ఆస్పత్రికి తీసుకెళ్లకుండానే సదరు మహిళను తిరిగి మాములు మనిషిని చేసింది. వధువు ప్రథమ చికిత్స అందించన తర్వాత సదరు మహిళను ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Doctor Bride Saves Life) అవుతోంది. వధువు సకాలంలో స్పందించడం వలన ఆమె ప్రాణాపాయం నుండి బయటపడిందని స్థానిక ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వధువుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెళ్లికి వచ్చిన వారితో పాటు, స్థానికులు, నెటిజన్లు పెళ్లి కూతుర్ని ప్రశంసలతో ముంచెత్తారు.
ఇవీ చదవండి:
రూపాయి గాయానికి ఆర్‌బీఐ మందేమిటో..
జనరిక్ సెమాగ్లుటైడ్ తయారీకి డాక్టర్ రెడ్డీస్‌కు గ్రీన్ సిగ్నల్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి