Bihar Woman Love: ఫ్యాన్ రిపేర్ చేయడానికి వచ్చి ప్రేమలో పడేశాడు..
ABN , Publish Date - Apr 10 , 2025 | 08:05 AM
Bihar Woman LOVE Story: అతడ్ని చూడగానే మొదటి చూపులోనే ప్రేమలో పడింది. ఆ విషయం అతడికి చెప్పడానికి నానా ఇబ్బందులు పడింది. అతడు ఆమెను పట్టించుకునే వాడు కాదు.. ఎంతో కష్టపడి అతడ్ని తన ప్రేమలోకి దించింది. తర్వాత పెళ్లి చేసుకుంది.

ప్రేమ పుట్టాలన్నా.. ప్రేమలు పెళ్లి వరకు వెళ్లాలన్నా.. పెళ్లి తర్వాత కాపురం సాఫీగా సాగాలన్నా.. నూటికి 90 శాతం ఆడవాళ్ల మీదే ఆధారపడి ఉంటుంది. బంధంలో వాళ్లు తీసుకునే నిర్ణయాలే కీలకం. ఆడవాళ్లకు ఇంట్రస్ట్ లేకపోతే.. తర్వాత కూడా రాకపోతే.. మగాడు ఏం చేసినా లాభం ఉండదు. సైకాలజీ పరంగా చూసుకున్నా.. మగాళ్లను ఆడాళ్లు అట్రాక్ట్ చేయటం ఈజీ టాస్క్.. కానీ, మగాళ్లు ఆడవాళ్లను అట్రాక్ట్ చేయాలంటే తల ప్రాణాలు తోకలోకి వస్తాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఫ్యాన్ రిపేర్ చేసే వ్యక్తితో ఓ మహిళ ప్రేమలో పడింది. ప్రేమలో పడ్డమే కాదు.. పెళ్లి కూడా చేసుకుంది. ఆ ప్రేమ, పెళ్లి వరకు వెళ్లడానికి ఆ మహిళ కృషి ఎక్కువ మొత్తంలో ఉంది. అందువల్లే ప్రేమ, పెళ్లి వెంటవెంటనే జరిగిపోయాయి.
ఆ ప్రేమ పక్షులకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఇంట్లో ఫ్యాన్ గత కొన్ని రోజులనుంచి తిరగటం లేదు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ ఉన్నాడు. ఊర్లో ఏదైనా సమస్య వస్తే అతడ్నే పిలుస్తూ ఉంటారు. ఆ మహిళ కూడా ఫ్యాన్ రిపేర్ చేయడానికి అతడ్ని పిలిచింది. అతడు వచ్చి ఫ్యాన్ రిపేర్ చేశాడు. వెళ్లిపోయే సమయంలో ఆమె అతడి ఫోన్ నెంబర్ అడిగింది.‘ ఫ్యాన్ మళ్లీ పాడైతే.. నేరుగా మీకే ఫోన్ చేస్తాను. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి’ అని అంది. అతడు నెంబర్ ఇచ్చాడు. తర్వాతి నుంచి ఆమె ఫోన్లు చేయటం మొదలెట్టింది. మెల్లమెల్లగా తన మనసులోని ప్రేమను అతడికి చెప్పింది. అతడు కూడా ఆమెను ప్రేమించటం మొదలెట్టాడు.
తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ప్రేమ, పెళ్లి గురించి ఆ మహిళ మాట్లాడుతూ.. ‘ నేను మొదటి చూపులోనే అతడితో ప్రేమలో పడ్డాను. కానీ, ఆ విషయాన్ని అతడికి చెప్పలేకపోయాను. అతడ్ని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయేదాన్ని. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయా. అతడు మొదట్లో నన్ను పెద్దగా పట్టించుకునే వాడు కాదు. నేనే ఏదో ఒక సమస్య అని చెప్పి, అతడికి ఫోన్ చేసేదాన్ని. లైటు రిపేర్, టీవీ రిపేర్ అంటూ ఇంటికి పిలిచేదాన్ని. తరచుగా మా ఇంటికి వచ్చే వాడు. మా ఇద్దరి మధ్యా బంధం బలపడింది. నేనే అతడికి ప్రపోజ్ చేశాను. అతడు ఓకే అన్నాడు. ఇద్దరం పెళ్లి చేసుకున్నాం’ అని అంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి:
Tirupati: తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు..
Tahawwur Rana: ఇండియాకు తహవూర్ రాణా.. ఆ జైలుకే తరలింపు