Anand Mahindra: 44 ఏళ్ల కెరీర్‌లో నేను నేర్చుకున్నది ఇదే.. అనుభవాలను పంచుకున్న ఆనంద్ మహీంద్రా
ABN , Publish Date - Jul 15 , 2025 | 07:23 AM
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇటీవలె 44 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన సుదీర్ఘ కెరీర్‌లో తన అనుభవాలను, సక్సెస్ మంత్రాను సోషల్ మీడియా ద్వారా ఇతరులతో పంచుకున్నారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు మరియు సమస్యలు శాశ్వతం కాదని సందేశం ఇచ్చారు.

ఎవరి జీవితంలోనైనా 44 ఏళ్లు అంటే చాలా సుదీర్ఘ కాలం. అంత కాలం ఓ కెరీర్ కొనసాగించిన వ్యక్తికి ఎన్నో అనుభవాలు, ఆ రంగానికి సంబంధించిన గొప్ప జ్ఞానం ఉంటాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఇటీవలె 44 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన సుదీర్ఘ కెరీర్‌లో తన అనుభవాలను, సక్సెస్ మంత్రాను సోషల్ మీడియా ద్వారా ఇతరులతో పంచుకున్నారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు మరియు సమస్యలు శాశ్వతం కాదని సందేశం ఇచ్చారు (Anand Mahindra Message).
'నా 44 ఏళ్ల కెరీర్‌లో నేను నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం ఏదీ శాశ్వతం కాదు అనేది. కఠినమైన సమయాలు, ఒత్తిడి, ఎదురుదెబ్బలు.. అన్నీ తొలగిపోతాయి. తుఫాను మధ్యలో ఉన్నప్పుడు అది ఎప్పటికీ ముగియదేమో అనిపిస్తుంది. కానీ అంతటి తుఫానుకు కూడా ముగింపు అనేది ఉంటుంది` అని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. సాధ్యమైనంత ఉత్తమంగా పని చేయాలని, పరిస్థితులు మారుతాయని నమ్మకం పెట్టుకోవాలని ఆనంద్ సూచించారు.
'సవాళ్లకు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఒత్తిడిని తొలగించుకోవాలి. ఒత్తిడి మనల్ని బలహీనం చేస్తుంది. మీరు ఎంచుకున్న మార్గంలో స్థిరంగా కొనసాగండి. ఎప్పటికైనా పరిస్థితులు మారతాయని నమ్మండి. మీరు కోరుకున్నది కచ్చితంగా జరిగి తీరుతుంది` అని ఆయన జోడించారు. ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఆయన తన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా ఇతరులతో పంచుకుంటారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. ఆ కుర్రాళ్లకు భయం లేదా.. భారీ కొండచిలువ పక్కనే ఉంటే..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో 998ల మధ్య 993 ఎక్కడుందో 6 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..