Share News

Anand Mahindra warning: పది లక్షల ఉద్యోగాలు ఖాళీ.. ఏఐ కంటే ఇదే పెద్ద ప్రమాదమంటున్న ఆనంద్ మహీంద్రా..

ABN , Publish Date - Nov 18 , 2025 | 07:15 AM

ఉద్యోగాల విషయంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా మరో సంచలన విషయం వెల్లడించారు. ఇటీవల ఫోర్డ్స్ సంస్థ సీఈవో జిమ్ ఫార్లే పాడ్‌కాస్ట్‌ను ఊటంకిస్తూ ఆనంద్ మహీంద్రా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Anand Mahindra warning: పది లక్షల ఉద్యోగాలు ఖాళీ.. ఏఐ కంటే ఇదే పెద్ద ప్రమాదమంటున్న ఆనంద్ మహీంద్రా..
Anand Mahindra AI warning

మనదేశంలో ఎప్పుడూ ఉద్యోగాల కొరత ఉంటూనే ఉంటుంది. ఇక, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతాయని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా మరో సంచలన విషయం వెల్లడించారు. ఇటీవల ఫోర్డ్స్ సంస్థ సీఈవో జిమ్ ఫార్లే పాడ్‌కాస్ట్‌ను ఊటంకిస్తూ ఆనంద్ మహీంద్రా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది (AI job losses crisis).


'మన వైట్ కాలర్ ఉద్యోగాలను ఏఐ తుడిచిపెడుతుందని అందరూ భయపడుతన్నారు. అంతకంటే పెద్ద ప్రమాదం మరొకటి పొంచి ఉంది. ఇటీవల ఫోర్డ్ సీఈవో ఓ ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించారు. ఆయన సంస్థలో 5,000కు పైగా మెకానిక్ పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయట. వాటిల్లో చాలా ఉద్యోగాలకు కోటి రూపాయలకు పైగా వార్షిక వేతనం ఉంటుందట. అయినా ఆ ఉద్యోగాలకు అభ్యర్థులు దొరకడం లేదట. అమెరికా వ్యాప్తంగా ప్లంబింగ్, మెకానిక్, ఎలక్ట్రిక్, ట్రక్కింగ్ రంగాల్లో పది లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయట. ఇవి భవిష్యత్తు అంచనాలు కావు. ఇప్పటికే ఉన్నవి' అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు (Mahindra big crisis comment).


'మనందరం డిగ్రీలు, డెస్క్ జాబ్‌ల మీద దృష్టి పెట్టి నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని పెద్దగా పట్టించుకోలేదు (technology job fears). ఈ ఉద్యోగాలను ఏఐ భర్తీ చేయలేదు. వీటికి శిక్షణ, అనుభవం, నేర్పు, జడ్జిమెంట్ వంటి నైపుణ్యాలు ఉండాలి. రాబోయే ఏఐ యుగంలో సమాజాన్ని నిర్మించగల, నడిపించగల, మరమ్మత్తు చేయగల వ్యక్తులే విజేతలుగా నిలుస్తారు. డిగ్రీలు, వైట్ కాలర్ జాబ్‌లు కోరుకునే వారు వెనకబడతారు' అని ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు.


ఇవీ చదవండి:

ఇంటి నిర్వహణ కోసం ప్రత్యేక మేనేజర్.. నెలకు జీతం ఎంతో తెలిస్తే..

దొంగ మనసు మార్చిన చిన్నారి.. చూసి తీరాల్సిన వీడియో!

Read Latest and Viral news

Updated Date - Nov 18 , 2025 | 07:15 AM