Actress Mrunal Thakur: తన ప్రేమ గురించి చెప్పిన మృణాల్ ఠాకూర్
ABN , Publish Date - Apr 21 , 2025 | 08:43 PM
Actress Mrunal Thakur: ఫ్యామిలీ స్టార్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ సినిమా తర్వాత ఆమె కల్కీ సినిమాలో నటించారు.అది కూడా ఓ గెస్ట్ రూల్‌లో. ప్రస్తుతం ఆమె డెకాయిట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరావేగంగా సాగుతోంది. తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.

సీతా రామం సినిమాతో కుర్రకారు హృదయాల్లో సీతగా నిలిచిపోయారు మృణాల్ ఠాకూర్. తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ సినిమా తెలుగులోనే కాదు.. తమిళం, మలయాళ భాషల్లోనూ మంచి విజయాన్ని అందుకుంది. నానితో ఆమె నటించిన హాయ్ నాన్న సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం మృణాల్ డెకాయిట్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. డెకాయిట్ తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. ఫ్యామిలీ స్టార్ తర్వాత కల్కీ సినిమాలో మృణాల్ ఓ చిన్న పాత్రలో కనిపించారు. ఫ్యామిలీ స్టార్ తర్వాత డెకాయిట్‌లోనే ఫుల్ లెన్త్ క్యారెక్టర్ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది.
అతడితో ప్రేమలో మృణాల్..
మృణాల్ తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. తను ఓ వ్యక్తితో పిచ్చి ప్రేమలో ఉన్నట్లు చెప్పారు. మృణాల్ ప్రేమిస్తున్న వ్యక్తి ఎవరో కాదు.. ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఆమె మాట్లాడుతూ.. ‘ నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేను క్రికెటర్ విరాట్ కోహ్లీతో పిచ్చి ప్రేమలో ఉన్నాను. మా తమ్ముడి వల్లే నాకు క్రికెట్ అంటే ఇష్టంగా మారింది. అతడు విరాట్ కోహ్లీకి పెద్ద ఫ్యాన్. ఐదేళ్ల క్రితం నేను, మా తమ్ముడు స్టేడియంలో చాలా మ్యాచులు చూశాం. ఇండియా టీం మ్యాచ్ ఉన్నపుడు .. నేను బ్లూ జెర్సీ వేసుకునే దాన్ని. చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేసేదాన్ని. క్రికెటర్‌గా ఇప్పటికీ కోహ్లీ అంటే ఇష్టం ’ అని అన్నారు.
లవ్.. బ్రేకప్..
గతంలో మృణాల్ ఠాకూర్ ఓ వ్యక్తిని ప్రేమించారు. అయితే.. మృణాల్ ఓ నటి అయిన కారణంతో వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదు. దీంతో ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. 2023లో వీరిద్దరూ విడిపోయారు. ఈ బ్రేకప్ గురించి మృణాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ సరైన వ్యక్తి మన జీవితంలోకి వచ్చే వరకు .. ఎంతో మంది వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు. మీకు ఎవరు సూట్ అవుతారు అని మీకే తెలుస్తుంది. నన్ను చేసుకునేవాడికి లుక్స్ లేకపోయినా పర్లేదు. మంచి మనసు ఉండాలి. ఇప్పటి వరకు నా జీవితంలో చాలా బ్రేకప్స్ జరిగాయి. మరీ బాధపడేంతలా ఏమీ జరగలేదు. పరస్పర అంగీకారంతోటే విడిపోయాం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
Sri Krishnadevaraya: శ్రీ కృష్ణదేవరాయల సమాధిపై నీచమైన పని.. బుద్ధి లేదా మీకు..
Raj KasiReddy: రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు