Aadhar Card: ఆధార్ కార్డ్ మీద క్యూఆర్ కోడ్.. దాని వల్ల ఉపయోగాలేంటో తెలుసుకుందాం..
ABN , Publish Date - Feb 09 , 2025 | 07:36 AM
మన దేశంలో ఆధార్ అనేది ప్రాథమిక గుర్తింపు పత్రం కాబట్టి దానిలోని సమాచారం కచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డు మీద మన వ్యక్తిగత సమాచారంతో పాటు క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాని వల్ల కలిగే ఉపయోగాలేంటి? తెలుసుకుందాం..

మన దేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు (Aadhar Card) అనేది అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రం. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఈ ఆధార్ కార్డులను జారీ చేస్తుంది. ప్రభుత్వం నుంచి పొందాల్సిన అన్ని పథకాలకు, బ్యాంక్ ఖాతా తెరవడానికి, రేషన్ కార్డుతో సహా దేనికైనా ఆధార్ అనేది తప్పనిసరిగా మారిపోయింది. మన దేశంలో ఆధార్ అనేది ప్రాథమిక గుర్తింపు పత్రం కాబట్టి దానిలోని సమాచారం కచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డు మీద మన వ్యక్తిగత సమాచారంతో పాటు క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాని వల్ల కలిగే ఉపయోగాలేంటి? తెలుసుకుందాం.. (QR Code on Aadhar Card)
ఆధార్ కార్డు మీద మీ ఫొటో, చిరునామా, ఇతర వివరాలతో పాటు ఒక వైపున క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్‌ను యూఐడీఏఐ యొక్క mAadhaar యాప్ లేదా యూఐడీఏఐ ఆమోదించిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ యాప్‌ని ఉపయోగించి మాత్రమే ఆధార్‌లోని క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయగలం. ఈ యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్, విండోస్ మొదలైన అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్‌లోనూ ఉంటాయి. ఆ యాప్‌ల ద్వారా ఆధార్ కార్డ్ మీద క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే మీ పేరు, వివరాలు, లింగం, చిరునామాతో సహా ఆధార్ నెంబర్ మొదలైన వివరాలు తెలుస్తాయి.
ఒకవేళ ఎవరైనా ఫేక్ ఆధార్ కార్డును తయారు చేయించాలనుకుంటే దానిని ఈ క్యూఆర్ కోడ్ బయటపెడుతుందన్నమాట. ఈ క్యూర్ కోడ్ ద్వారా తనిఖీ చేయడం ద్వారా ఆ ఆధార్ కార్డు నిజమైనదా? నకిలీదా అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ క్యూఆర్ కోడ్‌ను mAadhaar యాప్ ద్వారా మీరు కూడా స్వయంగా చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్‌లోని ప్లేస్టోర్ ద్వారా ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మీ ఆధార్ కార్డు మీద ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే మీ వివరాలు వెల్లడి అవుతాయి.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..