Share News

తిప్పికొడితే టేప్‌ అంత పొడవు కూడా ఉండడు కానీ..

ABN , Publish Date - Sep 14 , 2025 | 01:20 PM

తిప్పికొడితే టేప్‌ అంత పొడవు కూడా ఉండడు. కానీ టేప్‌ భుజాలపై వేసుకుని చకచకా డిజైన్లు గీస్తుం టాడు. ఆ పిల్లోడు సృష్టించిన దుస్తుల కోసం ఏకంగా సెలబ్రిటీలే క్యూ కడుతుంటారు. అమెరికాకు చెందిన తొమ్మిదేళ్ల మ్యాక్స్‌ అలెంగ్జాండర్‌ పేరు ప్రస్తుతం ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగంలో చక్కర్లు కొడుతోంది.

తిప్పికొడితే టేప్‌ అంత పొడవు కూడా ఉండడు కానీ..

- లిటిల్‌ డిజైనర్‌

తిప్పికొడితే టేప్‌ అంత పొడవు కూడా ఉండడు. కానీ టేప్‌ భుజాలపై వేసుకుని చకచకా డిజైన్లు గీస్తుంటాడు. ఆ పిల్లోడు సృష్టించిన దుస్తుల కోసం ఏకంగా సెలబ్రిటీలే క్యూ కడుతుంటారు. అమెరికాకు చెందిన తొమ్మిదేళ్ల మ్యాక్స్‌ అలెంగ్జాండర్‌ పేరు ప్రస్తుతం ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగంలో చక్కర్లు కొడుతోంది.

ఒకరోజు షాపింగ్‌ చేస్తుంటే... షోరూమ్‌లో ఉన్న డిస్‌ప్లే బొమ్మ కావాలని అడిగాడట మ్యాక్స్‌. పైగా ‘నేను దుస్తులు డిజైన్‌ చేస్తా’ అని వచ్చీరాని మాటలతో అన్నాడట. అప్పుడతని వయసు కేవలం నాలుగేళ్లు. మ్యాక్స్‌ అదేపనిగా మారాం చేస్తుంటే... ఇంట్లోనే అట్ట ముక్కలతో ఓ బొమ్మను తయారుచేసి ఇచ్చింది వాళ్ల అమ్మ.


అయితే చిచ్చరపిడుగు మ్యాక్స్‌... వారం తిరిగే సరికి ఆ బొమ్మకు ఓ డ్రెస్‌ తయారుచేశాడు. దాంతో ఆమె ఆశ్చర్యపోయింది. ఈసారి సీరియస్‌గా కొడుకు ఆసక్తిని నిజం చేయాలనుకుని, ఇంటి దగ్గర్లోని ఒక శిక్షణ కేంద్రంలో చేర్పించింది. అక్కడే చిన్నారి మ్యాక్స్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో మెలకువలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత తన చిట్టిచేతులతో అద్భుతాలు సృష్టించాడు. అలా సొంతంగా దుస్తుల డిజైనింగ్‌ స్టూడియో ఏర్పాటుచేశాడు. తన డిజైనింగ్‌ స్టైల్స్‌, ప్రత్యేకతలతో అంచెలంచెలుగా ఎదుగుతూ ‘సెలబ్రిటీ డిజైనర్‌’గా పేరు తెచ్చుకున్నాడు.


ఇప్పటికే వందకు పైగా డిజైనర్‌ దుస్తులను సెలబ్రిటీలకు అందించి, అంతర్జాతీయ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఫ్యాషన్‌ షోలు కూడా నిర్వహించాడు. ప్రపంచంలో అతి పిన్న వయస్కుడైన రన్‌ వే ఫ్యాషన్‌ డిజైనర్‌గా మ్యాక్స్‌ ‘గిన్నిస్‌’ రికార్డు ల్లోకి ఎక్కాడు. ఈ బుడతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారంటే... అతడి రేంజ్‌ ఏమిటో ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది కదూ.

Updated Date - Sep 14 , 2025 | 01:20 PM