Taif amusement park crash: వామ్మో.. థ్రిల్లింగ్ రైడ్‌లో అనూహ్య ఘటన.. చివరకు ఏం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Aug 02 , 2025 | 03:01 PM
సాధారణంగా థ్రిల్లింగ్ రైడ్‌ల విషయంలో పార్క్ నిర్వాహకులు చాలా కఠినంగా ఉంటారు. అయితే అప్పుడప్పుడు మాత్రం ప్రమాదాలు తప్పదు. తాజాగా సౌదీ అరేబియాలో అలాంటి ప్రమాదమే జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అమ్యూజ్‌మెంట్ పార్క్‌కు వెళ్లినపుడు రకరకాల థ్రిల్లింగ్ గేమ్స్ ఉంటాయి. జెయింట్ వీల్, రోలర్ కోస్టర్ రైడర్, 360 డిగ్రీస్ రైడ్ (360 degree ride) వంటి కళ్లు తిరిగే రైడ్స్ ఉంటాయి. ధైర్యవంతులు, గుండె నిబ్బరం కలిగిన వ్యక్తులు మాత్రమే వీటి జోలికి వెళతారు. సాధారణంగా అలాంటి రైడ్‌ల విషయంలో పార్క్ నిర్వాహకులు చాలా కఠినంగా ఉంటారు. అయితే అప్పుడప్పుడు మాత్రం ప్రమాదాలు తప్పదు. తాజాగా సౌదీ అరేబియా (Saudi Arabia)లో అలాంటి ప్రమాదమే జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Taif amusement park crash).
సౌదీ అరేబియాలోని తైఫ్‌లోని ఒక అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో 360 డిగ్రీ రైడ్ కొందరికి భయంకర అనుభవం ఎదురైంది. మూడు భారీ స్థంభాలకు ఓ ఊయలలాంటిది అమర్చి ఉంది. దానిపై కూర్చున్న జనాలు ఆ 360 డిగ్రీల రైడ్‌ను అరుపులు, కేకలతో ఆస్వాదిస్తున్నారు. ఆ ఊయల పలుసార్లు అటూ ఇటూ తిరిగింది. కాసేపటి తర్వాత అకస్మాత్తుగా ఆ ఊయల అమర్చి ఉన్న స్తంభం విరిగిపోయింది. దీంతో ఆ ఊయల పక్కకు ఎగిరిపడింది.
ఈ ప్రమాదంలో ఊయలలో ఉన్న పులువురు గాయపడ్డారు. అలాగే విరిగిన స్తంభం ఎగిరివెళ్లి పక్కనే నిలబడి ఉన్న కొందరిపై పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 23 మంది గాయపడినట్టు తెలుస్తోంది. సంఘటన జరిగిన వెంటనే భద్రతా దళాలు, అత్యవసర బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అధికారులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి..
మీది డేగ చూపు అయితే.. ఈ చింపాంజీ కళ్లజోడు ఎక్కడుందో 5 సెకెన్లలో కనుక్కోండి..
మీ పిల్లలు ఎక్కువగా మొబైల్ చూస్తున్నారా? ఈ ట్రిక్ ఉపయోగించి చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..