120 Year Old: 120 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలా.. 50 ఏళ్లుగా అదే పని
ABN , Publish Date - Apr 20 , 2025 | 01:51 PM
120 Year Old: తమిళనాడుకు చెందిన మహ్మద్ అబు సలీమ్ వయసు ప్రస్తుతం 120 సంవత్సరాలు. ఈ వయసులోనూ ఆయన పనులు ఆయనే చేసుకుంటున్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇప్పటికీ కూడా లడ్డూలు చేసి అమ్ముతూ ఉన్నాడు. దాదాపు 50 ఏళ్ల నుంచి లడ్డూలు చేసి అమ్ముతున్నాడు.

ఓ 60, 70 ఏళ్లు రాగానే.. నూటికి 90 శాతం మంది చేసే పనులనుంచి రిటైర్ అయిపోతారు. ఇంట్లో కూర్చుని మిగిలిన సమయాన్ని కుటుంబంతో గడపడానికి చూస్తారు. అయితే, తమిళనాడుకు చెందిన ఓ వృద్ధుడు మాత్రం 120 ఏళ్ల వయసులోనూ చక్కగా పని చేసుకుంటున్నాడు. దాదాపు 50 ఏళ్ల నుంచి లడ్డూలు చేసి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఇప్పటికీ కూడా అదే పని చేస్తున్నాడు. 120 ఏళ్ల వయసులోనూ కష్టపడుతున్న ఆ పెద్దాయనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... ఆ పెద్దాయన పేరు మహ్మద్ అబు సలీమ్. ఆయనది బర్మా దేశం. చాలా ఏళ్ల క్రితమే తమిళనాడుకు వచ్చి సెటిల్ అయ్యాడు.
ఓ ప్రమాదంలో అతడి కుటుంబసభ్యులందరూ చనిపోయారు. కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకుని చేదులాంటి బాధతో అల్లాడుతున్న ఆయన.. తీపి తిను బండారాలు తయారు చేసి అమ్మాలని నిశ్చయించాడు. దాదాపుగా 50 ఏళ్లుగా అల్లం, కొబ్బెర, గ్లూకోజ్‌తో తయారు చేసిన రుచికరమైన లడ్డూలు అమ్ముతూ ఉన్నాడు. మహ్మద్ తయారు చేసే లడ్డూలు కడలూరు, విల్లుపురం, తిండివనమ్, మాయావరమ్, కుంభకోణంతో పాటు చాలా ఏరియాల్లో ఫేమస్. ఒకప్పుడు ఆ ప్రదేశాలు మొత్తం తిరిగి లడ్డూలు అమ్మేవాడు. కానీ, ఇప్పుడు నడవలేని స్థితిలో ఉండటంతో బయటకు వెళ్లటం మానేశాడు. క్యాండీలు తయారు చేసి ఇంట్లోనే అమ్ముతున్నాడు.
జనం ఆయన ఇంటి దగ్గరకు వచ్చి లడ్డూలు కొంటూ ఉన్నారు. ఆయనకు ఇప్పుడు 120 ఏళ్ల వయసు.. 50 ఏళ్ల నుంచి లడ్డూలు తయారు చేసి అమ్ముతూ ఉన్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆయన ప్రతీ రోజు 2 నుంచి 3 లడ్డూలు తింటాడట. అయినా తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని అంటున్నాడు. మహ్మద్ షేక్ అనే వ్యక్తి 120 ఏళ్ల పెద్దాయన్ని ఇంటర్వ్యూ చేశాడు. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 120 ఏళ్ల వయసులోనూ కష్టపడుతున్న ఆ పెద్దాయనపై నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. మరి, పెద్దాయన గురించి మీరేమనుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
ఫేక్ డాక్టర్‌తో ఇంట్లో ఆపరేషన్.. మహిళ ప్రాణం పాయే..
JEE topper: పరీక్షకు ముందు యాక్సిడెంట్.. అయినా జేఈఈ టాపర్‌గా..