
Breaking News: కాసేపట్లో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
ABN , First Publish Date - Jun 11 , 2025 | 12:57 PM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jun 11, 2025 17:56 IST
ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
కాసేపట్లో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
తన దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తానన్న రేవంత్
కొత్త మంత్రుల శాఖలపై కొనసాగుతున్న సస్పెన్స్
వివేక్‌కు న్యాయ, క్రీడలు, కార్మిక శాఖలు కేటాయించే చాన్స్
ఎ.లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ కేటాయించే అవకాశం
వాకిటి శ్రీహరికి పశు సంవర్థక శాఖ కేటాయించే అవకాశం
-
Jun 11, 2025 16:48 IST
రేపటి నుంచే 'తల్లికి వందనం' పథకానికి శ్రీకారం
రేపు తల్లుల ఖాతాల్లో 'తల్లికి వందనం' నిధులు
రూ.8,745 కోట్లు జమ చేయనున్న ఏపీ ప్రభుత్వం
ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున 'తల్లికి వందనం'
ఏపీలో 67,27,164 మంది విద్యార్థులకు 'తల్లికి వందనం'
ఈ ఏడాది ఒకటో తరగతి, ఇంటర్‌లో చేరిన వారికీ 'తల్లికి వందనం'
అడ్మిషన్లు పూర్తయి డేటా అందుబాటులోకి రాగానే నిధులు జమ
-
Jun 11, 2025 15:48 IST
TGPSC గ్రూప్-1 అంశంపై హైకోర్టులో విచారణ
విచారణను ఈ నెల 30కి వాయిదావేసిరన TG హైకోర్టు
గ్రూప్-1 మెయిన్స్‌లో అక్రమాలు జరిగాయని అభ్యర్థుల పిటిషన్లు
పరీక్షా కేంద్రాల కేటాయింపు, మూల్యాంకనంలో అక్రమాలపై పిటిషన్లు
మే నెలలో అభ్యర్థుల పిటిషన్లపై హైకోర్టులో వాదనలు
గ్రూప్-1 నియామకాలపై స్టే విధించిన TG హైకోర్టు
-
Jun 11, 2025 14:20 IST
కేసీఆర్ విచారణ.. ప్రశ్నలు ఇవే..
కేసీఆర్‌ను 18 ప్రశ్నలు అడిగిన కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్
బ్యారేజీల్లో నీటి నిల్వపై మీరేమైనా ఆదేశాలు ఇచ్చారా అని ప్రశ్నించిన కమిషన్
తాను అలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్న కేసీఆర్
బ్యారేజీలు నీటిని ఎత్తిపోసేందుకు నిర్మించినవని కేసీఆర్ జవాబు
ప్రాజెక్ట్ లొకేషన్ మార్పు నిర్ణయం ఎవరిదని ప్రశ్నించిన కమిషన్
లొకేషన్ ఎందుకు మార్చాల్సి వచ్చిందో సుదీర్ఘంగా వివరించిన కేసీఆర్
తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదని CWC చెప్పింది: కేసీఆర్
వ్యాప్కోస్ సర్వే చేసి నివేదిక ఇచ్చింది: కేసీఆర్
టెక్నికల్ టీం 3 బ్యారేజీలు నిర్మించాలని చెప్పింది: కేసీఆర్
తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించలేదు: కేసీఆర్
టెక్నికల్ టీం నివేదికతో లొకేషన్ మార్పు జరిగింది: కేసీఆర్
నిర్ణయాలన్నీ కేబినెట్ ఆమోదంతోనే జరిగాయి: కేసీఆర్
-
Jun 11, 2025 13:32 IST
కాసేపట్లో యశోద ఆస్పత్రికి కేసీఆర్
పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పరామర్శించనున్న కేసీఆర్
ఉదయం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జారిపడ్డ పల్లా
స్వల్ప గాయాలతో యశోద ఆస్పత్రిలో చేరిన పల్లా
-
Jun 11, 2025 13:32 IST
తెలంగాణ ప్రాజెక్టులపై ప్రధానికి ఎప్పుడైనా నివేదిక ఇచ్చారా?: సీఎం రేవంత్
కేంద్ర కేబినెట్‌లో ఎప్పుడైనా కిషన్‌రెడ్డి తెలంగాణ అంశాలను ప్రస్తావించారా?: సీఎం రేవంత్
కిషన్‌రెడ్డి తెలంగాణకు ఒక్క ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేదు: సీఎం రేవంత్
రాష్ట్రాభివృద్ధికి కిషన్‌రెడ్డి ముందుకొస్తే కలిసి పనిచేసేందుకు సిద్ధం: రేవంత్
తెలంగాణ ప్రాజెక్ట్‌లపై కిషన్‌రెడ్డితో సమీక్ష చేసేందుకు సిద్ధం: రేవంత్
-
Jun 11, 2025 13:32 IST
నా ఢిల్లీ పర్యటన కర్ణాటక కులగణన కోసం మాత్రమే: సీఎం రేవంత్
కులగణన అంశంలో తెలంగాణ మోడల్‌నే కర్ణాటకలో అమలు: రేవంత్
సామాజిక సమానతలు ఉన్నంతవరకు నక్సలిజం ఉంటుంది: రేవంత్
కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు ప్రధాన శత్రువులు: సీఎం రేవంత్
నేనున్నంతవరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్‌లో నో ఎంట్రీ: రేవంత్
తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నది కిషన్‌రెడ్డే: రేవంత్‌రెడ్డి
-
Jun 11, 2025 13:32 IST
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్
మంత్రులకు శాఖల కేటాయింపుపై రేవంత్‌రెడ్డి క్లారిటీ
కొత్త మంత్రులకు నా దగ్గర ఉన్న శాఖలే కేటాయిస్తా: రేవంత్
ఎవరికైనా పని భారం ఉంటే వారి శాఖలు కూడా కేటాయిస్తా
పని భారం ఉందని ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదు: రేవంత్
హైదరాబాద్‌కు వెళ్లగానే కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
కాళేశ్వరం అంశంపై 2 రోజుల్లో మీడియా సమావేశం: రేవంత్
-
Jun 11, 2025 13:01 IST
ముగిసిన కేసీఆర్ విచారణ
50 నిమిషాల పాటు కొనసాగిన విచారణ
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేసీఆర్ ప్రశ్నించిన కమిషన్
-
Jun 11, 2025 12:57 IST
ఆత్మహత్యలు పెరిగాయి: వైఎస్ జగన్..
రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: మాజీ సీఎం జగన్
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి: జగన్
ప్రకాశం జిల్లాలోనే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు: జగన్
గిట్టుబాటు ధర లేదు, రైతు భరోసా ఆగిపోయింది: జగన్
ఈ క్రాప్ వ్యవస్థను పూర్తిగా నీరుగార్చారు: జగన్