మాక్ అసెంబ్లీలో విద్యార్థులు అదరగొట్టారు: సీఎం చంద్రబాబు
ABN , First Publish Date - Nov 26 , 2025 | 06:58 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 26, 2025 21:13 IST
ఢిల్లీ: 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య బిడ్‌ను దక్కించుకున్న భారత్
కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య బిడ్‌ను భారత్ దక్కించుకోవడంపై ప్రధాని ట్వీట్
శతాబ్ది కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య బిడ్ దక్కడం హర్షణీయం: ప్రధాని మోదీ
శతాబ్ది కామన్వెల్త్ క్రీడలు నిర్వహణకు ఆసక్తిగా ఉన్నాం: ప్రధాని మోదీ
ప్రపంచాన్ని స్వాగతించడానికి ఎదురుచూస్తున్నాం: ప్రధాని మోదీ
-
Nov 26, 2025 20:09 IST
APPSC గ్రూప్-1 మెయిన్స్ అక్రమాలు తేల్చే విషయంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.జి.శంకర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
స్వతంత్ర కమిటీ చైర్మన్‌గా జస్టిస్ కె.జి.శంకర్ నియామకం
సభ్యులుగా బార్ కౌన్సిల్ మాజీ ఛైర్మన్ గంటా రామారావు,...
నాగార్జున యూనివర్సిటీ పూర్వ వీసీ ప్రొ.రాజేంద్రప్రసాద్ నియామకం
హాయ్ ల్యాండ్‌లో జవాబుపత్రాల మూల్యాంకనం జరిగిందా?,...
OMRపై మార్కులు నమోదు చేశారా? అనేది నిర్ధారించాలని సూచన
కమిటీ సమక్షంలో జవాబుపత్రాలు, OMR షీట్లు...
పరిశీలనకు ఇరువైపుల న్యాయవాదులకు అనుమతి
-
Nov 26, 2025 19:25 IST
మధ్యప్రదేశ్: రాయ్‌సేన్ జిల్లాలో ఉద్రిక్తత
బాలికపై అత్యాచారానికి వ్యతిరేకంగా నిరసనలు
దుకాణాలు, వాహనాలపై ఆందోళనకారుల దాడి
పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు
నిరసనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు
-
Nov 26, 2025 18:24 IST
ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు
రఘురామపై థర్డ్ డిగ్రీ కేసులో నోటీసులు ఇచ్చిన గుంటూరు CCS సిట్
డిసెంబర్ 4న గుంటూరు సిట్ ఎదుట హాజరుకావాలని ఆదేశం
-
Nov 26, 2025 17:32 IST
పాక్ జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను చంపేశారని ప్రచారం
ఇమ్రాన్‌ను హత్య చేశారంటున్న ఆఫ్ఘనిస్థాన్ రక్షణశాఖ
పాకిస్తాన్‌లో పీటీఐ నేతల ఆందోళనలు, లాఠీచార్జ్
ఇమ్రాన్‌ఖాన్‌ను చూపించాలంటూ మద్దతుదారులు డిమాండ్
ప్రస్తుత పరిణామాలపై పాక్ ఆర్మీ చీఫ్ అత్యవసర భేటీ
2023 ఆగస్టు నుంచి అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్‌ఖాన్
-
Nov 26, 2025 16:31 IST
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్రొడక్షన్‌కు రూ.7,280 కోట్లు కేటాయింపు
పుణె మెట్రో రైల్ పొడిగింపునకు రూ.9,858కోట్లు కేటాయింపు
దేవభూమి ద్వారక-కర్నాలస్ రైల్వే లైన్ డబ్లింగ్‌కు ఆమోదం
రూ.1,457 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం
బద్లాపూర్-కార్జత్ థర్డ్, ఫోర్త్ రైల్వే పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
-
Nov 26, 2025 16:31 IST
కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పవర్ స్కామ్‌కు తెరలేపింది: హరీశ్‌రావు
రూ.50 వేల కోట్ల పవర్‌స్కామ్‌కు కాంగ్రెస్ తెరలేపింది: హరీశ్‌రావు
రూ.50 వేల కోట్లలో రేవంత్ ప్రభుత్వానికి 30, 40 శాతం కమీషన్లు
రేవంత్ ప్రభుత్వం ఏం చేసినా ఒక మిషన్ ఉంటుంది.. ఆ మిషనే కమీషన్
కమీషన్లు కొల్లగొట్టాలని మాత్రమే రేవంత్ ప్రభుత్వం ఆలోచిస్తోంది
వాటాల పంపిణీ విషయంలో మంత్రులు ఘర్షణ పడుతున్నారు: హరీశ్‌రావు
మంత్రుల కుటుంబసభ్యులే బయటకు వచ్చి వాటాల అంశంపై చెబుతున్నారు
రాష్ట్రాన్ని అరాచకాలకు కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తోంది: హరీశ్‌రావు
-
Nov 26, 2025 16:05 IST
ఏపీకి తప్పిన సెన్యార్ తుఫాన్ ముప్పు
ఇండోనేషియాలో తీరం దాటిన సెన్యార్ తుఫాన్
తుఫాన్‌గా మారిన కాసేపట్లోనే తీరం దాటిన సెన్యార్
ఏపీకి సెన్యార్ ముప్పులేదని తెలిపిన వాతావరణ శాఖ
-
Nov 26, 2025 16:04 IST
హైదరాబాద్: ఐ బొమ్మ కేసులో ఇమంది రవి కోర్టుకు హాజరు
పీటీ వారెంట్‌పై రవిని కోర్టుకు హాజరుపరిచిన పోలీసులు
-
Nov 26, 2025 15:03 IST
ఢిల్లీ: కర్ణాటక సీఎం మార్పు ప్రచారాన్ని ఖండించిన డీకే శివకుమార్
ఎమ్మెల్యేలు అందరూ కలిసికట్టుగానే ఉన్నారు: డీకే శివకుమార్
సీఎం మార్పుపై ఎలాంటి డిమాండ్ లేదు: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
-
Nov 26, 2025 14:31 IST
హైదరాబాద్: మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన మరో ఐటీ కంపెనీ
శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇప్పిస్తామని NSN ఇన్ఫోటెక్ పేరిట నిరుద్యోగులకు వల
400 మంది విద్యార్థుల నుంచి రూ.3లక్షల చొప్పున వసూలు
భారీగా డబ్బులు వసూలు చేసి పరారైన స్వామినాయుడు
-
Nov 26, 2025 14:18 IST
టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు
నా భవిష్యత్‌పై తుది నిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐ: గంభీర్
నాకు పదవిలో కొనసాగడానికి అర్హత ఉందా? లేదా? బోర్డు డిసైడ్ చేస్తుంది
భారత క్రికెట్ మాత్రమే ముఖ్యం.. నేను కాదు: గంభీర్
-
Nov 26, 2025 13:51 IST
వరంగల్: రేవంత్ రెడ్డి అవినీతి అనకొండ: కేటీఆర్
రేవంత్ అన్నదమ్ములు ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారు
తెలంగాణ కాంగ్రెస్‌కు ఏటీఎంలా మారింది: కేటీఆర్
బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకే రిజర్వేషన్ల డ్రామా ఆడారు: కేటీఆర్
బీసీలను మోసం చేసినందుకు రేవంత్ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
-
Nov 26, 2025 12:44 IST
గువాహటి టెస్టులో భారత్ ఓటమి
టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న సౌతాఫ్రికా
408 పరుగుల తేడాతో భారత్ ఘోర ఓటమి
గంభీర్ నిర్ణయాలే ఓటమికి కారణమంటున్న విశ్లేషకులు
తొలిఇన్నింగ్స్: సౌతాఫ్రికా 489, భారత్ 201
సెకండిన్నింగ్స్: సౌతాఫ్రికా 260 డిక్లేర్, భారత్ 140 ఆలౌట్
-
Nov 26, 2025 12:05 IST
మాక్ అసెంబ్లీలో విద్యార్థులు అదరగొట్టారు: సీఎం చంద్రబాబు
బాధ్యత గుర్తుపెట్టుకునేలా మాక్ అసెంబ్లీ నిర్వహించారు: చంద్రబాబు
చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక దేశం భారత్
విజన్ ఉంటే సరిపోదు.. దాన్ని అమలు చేయడం ముఖ్యం: చంద్రబాబు
నిరంతరం శ్రమ చేస్తేనే అనుకున్నది సాధించగలం: సీఎం చంద్రబాబు
సరైన నిర్ణయాలు తీసుకుంటేనే ఏదైనా సాధించగలం: సీఎం చంద్రబాబు
చాలామంది హక్కులపైనే మాట్లాడతారు.. బాధ్యతలపై మాట్లాడరు
అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కష్టపడాల్సిందే: సీఎం చంద్రబాబు
-
Nov 26, 2025 11:10 IST
తుఫాన్‌గా బలపడిన తీవ్ర వాయుగుండం
తుఫాన్‌కు సెన్యార్‌గా నామకరణం
24 గంటల తర్వాత తుఫాన్ బలహీనపడే అవకాశం
-
Nov 26, 2025 11:10 IST
కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన
శంకరగుప్తం మెయిన్ డ్రైన్‌ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
ఉప్పునీరు కొబ్బరి తోటల్లో కలుస్తున్న తీరును పరిశీలించిన పవన్
-
Nov 26, 2025 11:10 IST
కేటుగాళ్ల ముఠా అరెస్ట్
IAS, IPS పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
నకిలీ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్న ఫిలింనగర్ పోలీసులు
-
Nov 26, 2025 11:10 IST
ఢిల్లీ పేలుడు కేసులో ఫరీదాబాద్ వాసి సోయబ్ అరెస్ట్
ఉగ్రవాది ఉమర్ నబీకి ఆశ్రయం ఇచ్చిన సోయబ్
పేలుడు కేసులో ఏడో నిందితుడిగా సోయబ్‌ను అరెస్ట్ చేసిన NIA
-
Nov 26, 2025 11:10 IST
కర్ణాటక వ్యవహారంపై రాహుల్ గాంధీ ఫోకస్
కర్ణాటక మంత్రులు, సీనియర్ నేతలతో రాహుల్ చర్చలు
సీఎం పదవిపై పట్టువీడని డీకే శివకుమార్
త్వరలో సిద్ధరామయ్య, శివకుమార్‌ను ఢిల్లీకి పిలిచే అవకాశం
కర్ణాటక సీఎం మార్పుపై ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ
-
Nov 26, 2025 11:08 IST
సాఫ్రాన్ సంస్థ ఏర్పాటు హైదరాబాద్ అభివృద్ధికి దోహదం చేస్తుంది: సీఎం రేవంత్
హైదరాబాద్‌ను ఎంచుకున్న సాఫ్రాన్ సంస్థకు ధన్యవాదాలు: సీఎం రేవంత్
ఎరోస్పేస్, ఏవియేషన్ హబ్‌గా హైదరాబాద్ ఎదుగుతోంది: రేవంత్‌రెడ్డి
ఏవియేషన్‌కు చెందిన పలు సంస్థలు ఇక్కడే ఉన్నాయి: సీఎం రేవంత్
సాఫ్రాన్‌కు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుంది: రేవంత్
గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నాం: సీఎం రేవంత్
30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయబోతున్నాం
ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం: రేవంత్
-
Nov 26, 2025 11:08 IST
భారత్‌లోనే ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ప్రారంభం సంతోషకరం: కేంద్రమంత్రి రామ్మోహన్
భవిష్యత్‌లో ఎయిర్ క్రాఫ్ట్‌ల తయారీ ఖర్చు భారీగా తగ్గనుంది: కేంద్రమంత్రి రామ్మోహన్
తయారీ ఖర్చు తగ్గితే లాభం ప్రయాణికులకు కూడా బదిలీ అవుతుంది
ఎయిర్ క్రాప్ట్ ఇంజిన్ సర్వీసెస్ కోసం సింగపూర్..
మలేసియా దేశాలపై అధికంగా ఆధారపడుతున్నాం: రామ్మోహన్ నాయుడు
ఆత్మనిర్భర్ భారత్ వల్లే ఇది సాధ్యమవుతోంది: రామ్మోహన్ నాయుడు
-
Nov 26, 2025 11:07 IST
క్రాప్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఫెసిలిటీని వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ
పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
రఫేల్ విమానాల్లో ఉపయోగించే M88 ఇంజిన్ కోసం..
ఏర్పాటు చేస్తున్న కొత్త MRO యూనిట్‌కు శంకుస్థాపన చేసిన మోదీ
-
Nov 26, 2025 09:34 IST
మాక్ అసెంబ్లీ
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల మాక్ అసెంబ్లీ
మాక్ అసెంబ్లీకి హాజరైన సీఎం చంద్రబాబు
-
Nov 26, 2025 09:08 IST
బెట్టింగ్ల బారిన పడి అప్పులపాలైన భాను ప్రకాశ్
అప్పులు తీర్చేందుకు అడ్డదారులు తొక్కిన భాను ప్రకాశ్
బంగారం రికవరీలో 5తులాలు సొంతానికి వాడుకున్న భాను ప్రకాశ్
-
Nov 26, 2025 09:08 IST
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి,..
బాలాజీ గోవిందప్ప డిఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు
నేడు ఏసీబీ కోర్టులో లొంగిపోవాలని ఏపీ హైకోర్టు ఆదేశం
-
Nov 26, 2025 09:07 IST
అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి
హైదరాబాద్: శాలిబండ అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి
చికిత్సపొందుతూ షాప్ యజమాని శివకుమార్ మృతి
మరో ఐదుగురికి ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స
-
Nov 26, 2025 08:10 IST
చిరుత సంచారం
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ క్వార్టర్స్‌లో చిరుత సంచారం
సీసీ కెమెరాల్లో నమోదైన చిరుత సంచారం దృశ్యాలు
చిరుత సంచారంతో భయాందోళనలో విద్యార్థులు
-
Nov 26, 2025 07:34 IST
ఎంపీ సీఎం రమేశ్‌కు మాతృవియోగం..
హైదరాబాద్: బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తల్లి రత్నమ్మ(83) కన్నుమూత
వయో సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రత్నమ్మ
సంతాపం తెలిపిన పలువురు రాజకీయ ప్రముఖులు
రేపు కడప జిల్లా ఎర్రగుంట్ల మం. పోట్లదుర్తిలో అంతిమ సంస్కారాలు
-
Nov 26, 2025 07:33 IST
నేడు గ్లోబల్ సమ్మిట్ లాజిస్టిక్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్ష
సా. 4:30కు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష సమావేశం
హాజరుకానున్న మంత్రులు సీతక్క, పొన్నం, ఉన్నతాధికారులు
-
Nov 26, 2025 06:58 IST
మాక్ అసెంబ్లీ
నేడు అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాక్ అసెంబ్లీ
-
Nov 26, 2025 06:58 IST
నేడు రాజ్యాంగ దినోత్సవం
సంవిదాన్ సదన్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
పాల్గొననున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ