Health Tips: మీరు రోజూ ఎంతో ఇష్టంతో తినే ఈ ఆహారాలే.. మీ గుండెకు శత్రువులు..

ABN, Publish Date - Jul 31 , 2025 | 11:00 AM

నోటికి రుచిగా ఉందని చాలా మంది ఏది పడితే అది తినేస్తుంటారు. కొన్ని ఇలాంటి ఆహార పదార్థాలే మన ఆరోగ్యానికి శత్రువులుగా మారుతుంటాయి. ప్రధానంగా..

Health Tips: మీరు రోజూ ఎంతో ఇష్టంతో తినే ఈ ఆహారాలే.. మీ గుండెకు శత్రువులు.. 1/8

నోటికి రుచిగా ఉందని చాలా మంది ఏది పడితే అది తినేస్తుంటారు. కొన్ని ఇలాంటి ఆహార పదార్థాలే మన ఆరోగ్యానికి శత్రువులుగా మారుతుంటాయి. ప్రధానంగా కొన్ని ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఆ ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: మీరు రోజూ ఎంతో ఇష్టంతో తినే ఈ ఆహారాలే.. మీ గుండెకు శత్రువులు.. 2/8

ఫ్రెంచ్ ఫ్రైస్‌తో పాటూ వేయించిన ఆహారాలు ఎక్కవగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. 100 గ్రాముల వేయించిన ఫ్రెంచ్ ఫ్రైస్‌లో దాదాపు 8 గ్రాముల ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. తద్వారా గుండెకు ప్రమాదం తలెత్తే అవకాశం ఉంటుంది.

Health Tips: మీరు రోజూ ఎంతో ఇష్టంతో తినే ఈ ఆహారాలే.. మీ గుండెకు శత్రువులు.. 3/8

ఎరుపు, ప్రాసెస్ చేసిన మాంసాలు ఎక్కువగా తినడం వల్ల కూడా గుండెకు హాని కలిగే ప్రమాదం ఉంటుంది. వీటిలో ఉండే అమైనో ఆమ్లాలు పేగు బాక్టీరియాను ప్రభావితం చేస్తాయి. ఇది కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

Health Tips: మీరు రోజూ ఎంతో ఇష్టంతో తినే ఈ ఆహారాలే.. మీ గుండెకు శత్రువులు.. 4/8

ఇన్‌స్టంట్ సూప్‌లు ఎక్కువగా తాగడం వల్ల కూడా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఈ సూప్‌లలో ఉప్పు ఎక్కువా ఉంటుంది. దీంతో ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

Health Tips: మీరు రోజూ ఎంతో ఇష్టంతో తినే ఈ ఆహారాలే.. మీ గుండెకు శత్రువులు.. 5/8

ఎనర్జీ డ్రింక్స్ కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 100 ఎమ్‌ఎల్‌ ఎనర్జీ డ్రింక్‌లో దాదాపు 30 ఎమ్‌జీ కెఫిన్ ఉంటుంది. గుండె సమస్యలు ఉన్న వారు ఈ పానీయాలను అస్సుల తీసుకోకూడదు.

Health Tips: మీరు రోజూ ఎంతో ఇష్టంతో తినే ఈ ఆహారాలే.. మీ గుండెకు శత్రువులు.. 6/8

తెల్ల రొట్టెలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో వీటిని ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అలాగే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా రక్త నాళాలు దెబ్బతింటాయి. ఒక రోజులో 5 గ్రాములకంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.

Health Tips: మీరు రోజూ ఎంతో ఇష్టంతో తినే ఈ ఆహారాలే.. మీ గుండెకు శత్రువులు.. 7/8

ఒక పిజ్జా ముక్కలో సుమారు 10 గ్రాముల కొవ్వు ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులోని ఫాస్ట్ కార్బోహైడ్రేట్లు మరియు చక్కెర గుండెకు హాని చేస్తాయి.

Health Tips: మీరు రోజూ ఎంతో ఇష్టంతో తినే ఈ ఆహారాలే.. మీ గుండెకు శత్రువులు.. 8/8

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated at - Jul 31 , 2025 | 11:00 AM