Protein Food: గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ లభించే 7 ఆహారాలివే..
ABN, Publish Date - May 23 , 2025 | 07:10 AM
రోజూ ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతుంటారు. గుడ్లలో ఉండే ప్రొటీన్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే గుడ్లలో కంటే ఎక్కువ ప్రొటీన్ లభించే ఆహారాలు కూడా ఉన్నాయి.

రోజూ ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతుంటారు. గుడ్లలో ఉండే ప్రొటీన్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే గుడ్లలో కంటే ఎక్కువ ప్రొటీన్ లభించే ఆహారాలు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా 7 ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గుమ్మడికాయ గింజల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. 28 గ్రాముల కాల్చిన గుమ్మడికాయ గింజల్లో సుమారు 5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, విటమిన్-ఇ, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

పచ్చి బఠానీల్లోనూ ప్రొటీన్ ఉంటుంది. ఇందులో ఫైబర్, విటమిన్-కె, ఫోలేట్ తదితర పోషకాలు జీర్ణక్రియ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

క్వినోవాలోనూ అధిక ప్రొటీన్ ఉంటుంది. ఒక గిన్నెడు వండిన క్వినోవాలో సుమారు 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. అలెర్జీలు ఉన్నవారికి క్వినోవా మంచి ఫుడ్ అని చెప్పొచ్చు.

శనగ గింజల్లోనూ ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఒక గిన్నెడు వండిన శనగల్లో సుమారు 15 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ గింజల్లో జీర్ణక్రియ, శరీర బలానికి అవసరమైన ఫైబర్, ఐరన్, మెగ్నీషియం తదితర పోషకాలు కూడా ఉన్నాయి.

సోయాతో తయారైన పులియబెట్టిన ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల టెంపేలో దాదాపు 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఇందులో ఫైబర్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి కడుపు, ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

కాలీఫ్లవర్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇందులో పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం, విటమిన్-సి, కె, ఐరన్‌లతో పాటూ సినిగ్రిన్ కూడా ఉంటుంది. ఇవి ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

స్వీట్ కార్న్‌లో కూడా ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. రోజూ మీకు అవసరమైన ప్రొటీన్‌లో దాదాపు 9 శాతం ఇందులో ఉంటుంది. ఇందులో థయామిన్, విటమిన్-సి, బి6, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, మెగ్నీషియం తదితర పోషకాలు కూడా ఉన్నాయి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated at - May 23 , 2025 | 07:10 AM