Liver Health Tips: ఈ 4 లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ కాలేయం ప్రమాదంలో పడ్డట్లే..

ABN, Publish Date - Jun 13 , 2025 | 07:17 AM

మన శరీరంలోని అనేక ప్రధానమైన అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటూ జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. అయితే వివిధ కారణాల వల్ల కొన్నిసార్లు కాలేయం దెబ్బతింటుంది.

Liver Health Tips: ఈ 4 లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ కాలేయం ప్రమాదంలో పడ్డట్లే.. 1/7

మన శరీరంలోని అనేక ప్రధానమైన అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటూ జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. అయితే వివిధ కారణాల వల్ల కొన్నిసార్లు కాలేయం దెబ్బతింటుంది. కాలేయం పనితీరు మందగించే సమయంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ప్రధానంగా 4 లక్షణాలు కనిపించగానే జాగ్రత్తపడాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Liver Health Tips: ఈ 4 లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ కాలేయం ప్రమాదంలో పడ్డట్లే.. 2/7

చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం కాలేయం దెబ్బతినడానికి సంకేతం కావచ్చు. అలాగే గోర్లు పసుపు రంగులోకి మారితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Liver Health Tips: ఈ 4 లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ కాలేయం ప్రమాదంలో పడ్డట్లే.. 3/7

కడుపులో వాపు తగ్గకపోవడం కూడా కాలేయ సమస్యకు కారణం కావొచ్చు. ద్రవాలు చేరడం వల్ల ఇలా జరుగుతుంది. కాలేయం సరిగా పనిచేయని సమయంలో ఈ ద్రవాలు కడుపు, కాళ్లలో కూడా పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది.

Liver Health Tips: ఈ 4 లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ కాలేయం ప్రమాదంలో పడ్డట్లే.. 4/7

ఎలాంటి కారణాలు లేకుండా వికారం, వాంతులు అనిపిస్తుంటే కాలేయ సమస్య సంకేతం కావొచ్చు. మద్యం సేవించిన తర్వాత ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటే అది కాలేయం దెబ్బతినడానికి సంకేతం కావొచ్చు.

Liver Health Tips: ఈ 4 లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ కాలేయం ప్రమాదంలో పడ్డట్లే.. 5/7

కడుపులో కుడివైపు పైభాగంలో నొప్పి తగ్గకుండా వస్తున్నా కూడా కాలేయం దెబ్బతినడానికి సంకేతం కావొచ్చు. కాలేయం వాపునకు గురికావడం వల్ల ఇలా జరుగుతంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ లేదా ఆల్కాహాల్ వల్ల కూడా జరగవచ్చు.

Liver Health Tips: ఈ 4 లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ కాలేయం ప్రమాదంలో పడ్డట్లే.. 6/7

కాలేయాన్ని దెబ్బతీసే వాటిలో ఆల్కాహాల్ ముఖ్యమైనది. ఇది ఫ్యాటీ లివర్ వ్యాధి, లివర్ సిర్రోసిస్ తదితర వ్యాధులకు కారణమవుతుంది. అలాగే హెపటైటిస్ ఎ, బి, సి.. కూడా కాలేయాన్ని దెబ్బతీస్తాయి. అలదేవిధంగా ఆటో ఇమ్యూన్ హెపటైటిస్, పీబీసీ, పీఎస్‌సీ వంటి ఆటో ఇమ్యూన్ సమస్యలు కూడా కాలేయ సమస్యలకు కారణమవుతుంటాయి.

Liver Health Tips: ఈ 4 లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ కాలేయం ప్రమాదంలో పడ్డట్లే.. 7/7

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated at - Jun 13 , 2025 | 07:17 AM