Health Tips: మీ కడుపు క్లీన్ అవ్వాలంటే ఈ ఒక్క పండు తింటే చాలు..
ABN, Publish Date - Apr 27 , 2025 | 07:31 AM
ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో మనిషి అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నాడు. దీనికితోడు కలుషిత ఆహారంలో మరిన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు.

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో మనిషి అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నాడు. దీనికితోడు కలుషిత ఆహారంలో మరిన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో పోషకాహార కొరత సమస్యతో అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని పండ్లు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో పీచు పండు తినడం వల్ల కడుపు క్లీన్ అవడంతో పాటూ అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పీచూ పండ్ల ద్వారా కార్బోహైడ్రేట్లు, పొటాషియం, నియాసిన్, కాపర్, మాంగనీస్ తదితర పోషకాలు లభిస్తాయి. అలాగే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

పీచు పండ్లలోని అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ముడతలకు కారణమయ్యే ఆక్సీకరణ ఒత్తిడిని దూరం చేస్తాయి. అలాగే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మం దెబ్బతినకుండా నిరోధిస్తాయి.

పీచూ పండ్లను తీసుకోవడం వల్ల సుమారు 30 నిముషాల్లోనే మన కడుపు శుభ్రమవుతుంది. అలాగే కడుపు జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. వీటిని నేరుగా తిన్నా.. లేదా జ్యూస్ రూపంలో తీసుకున్నా కూడా చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

పీచూ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె కండరాలు బలంగా మారతాయి. పీచు పండ్లలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పీచెస్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో వాపు, కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అలాగే పీచు పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.

పీచూ పండ్లను తినడం వల్ల కడుపులోని నులి పురుగులు చనిపోతాయి. దీని ఆకులను నమలడం వల్ల కడుపులోని పురుగులు కూడా నశిస్తాయి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated at - Apr 27 , 2025 | 07:31 AM