Pomegranate Health Tips: దానిమ్మ తొక్కలను పక్కన పడేస్తున్నారా.. ఇలా చేస్తే ఎన్ని లాభాలో తెలుసా..
ABN, Publish Date - Jul 13 , 2025 | 01:04 PM
దానిమ్మ పండ్లు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. అయితే చాలా మంది పండ్లు తిని తొక్కలు పక్కన పడేస్తుంటారు. అయితే..

దానిమ్మ పండ్లు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. అయితే చాలా మంది పండ్లు తిని తొక్కలు పక్కన పడేస్తుంటారు. అయితే దానిమ్మ తొక్కల వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దానిమ్మ తొక్కల్లో విటమిన్లు, కాల్షియం, ప్రొటీన్, పొటాషియం తదితర పోషకాలు ఉంటాయి. దానిమ్మలోని పాలీఫెనాల్స్ అనే ఫైటోకెమికల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

దానిమ్మ తొక్కలు తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. శరీరంలో బలహీనతను కూడా తొలగిస్తుంది.

దానిమ్మ తొక్కలను ఎండలో ఎండబెట్టి తినడం వల్ల ఉత్తమ ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్, ప్రొటీన్, ఫినోలిక్ సమ్మేళనాలు శరీరానికి మేలు చేస్తాయి.

దానిమ్మ తొక్కలను పొడి చేసి తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఇందులోని ఔషధ గుణాలు గుండె జబ్బులను నియంత్రిస్తాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో బాగా పని చేస్తాయి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated at - Jul 13 , 2025 | 01:04 PM