Health Tips: తేనె, అల్లం కలిపి తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..

ABN, Publish Date - Jun 06 , 2025 | 06:25 AM

మన వంట గదిలో నిత్యం ఉపయోగించే వస్తువుల్లో అల్లం ఒకటి. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే తేనె వల్ల కూడా చాలా లాభాలున్నాయి.

Health Tips: తేనె, అల్లం కలిపి తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. 1/7

మన వంట గదిలో నిత్యం ఉపయోగించే వస్తువుల్లో అల్లం ఒకటి. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే తేనె వల్ల కూడా చాలా లాభాలున్నాయి.అయితే రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: తేనె, అల్లం కలిపి తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. 2/7

ఒక కప్పు నీటిలో చిన్న ముక్కలుగా తరిగిన అల్లంను మరిగించాలి. ఆ నీటిని వడకట్టి చల్లార్చిన తర్వాత అందులో టీస్పూన్ తేనె కలిపి తాగాలి.

Health Tips: తేనె, అల్లం కలిపి తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. 3/7

అల్లం, తేనె కలిపి తీసుకోవడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. అల్లం గొంతులో వాపును తగ్గిస్తుంది.

Health Tips: తేనె, అల్లం కలిపి తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. 4/7

అల్లంలోని ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి.

Health Tips: తేనె, అల్లం కలిపి తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. 5/7

తేనె, అల్లంలో పుష్కలంగా లభించే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అలాగే వాంతులు, వికారం, అలెర్జీలు, ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించడంలో దోహదం చేస్తాయి.

Health Tips: తేనె, అల్లం కలిపి తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. 6/7

అల్లం, తేనె గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంతో పాటూ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ అల్లం బాగా పని చేస్తుంది.

Health Tips: తేనె, అల్లం కలిపి తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. 7/7

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated at - Jun 06 , 2025 | 06:25 AM