Fitkari: వేసవిలో రాత్రి వేళల్లో పటికను రాయడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
ABN, Publish Date - Apr 23 , 2025 | 03:22 PM
వేసవిలో ఎండ వేడిమి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుంటాయి. ఇందులో చర్మ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా తలెత్తుతుంటాయి. చర్మం జిడ్డుగా మారడం, పొడిబారడం, మొటిమలు, దుద్దుర్లు తదితర సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే ..

వేసవిలో ఎండ వేడిమి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుంటాయి. ఇందులో చర్మ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా తలెత్తుతుంటాయి. చర్మం జిడ్డుగా మారడం, పొడిబారడం, మొటిమలు, దుద్దుర్లు తదితర సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే ముఖానికి పటిక రాయడం వల్ల ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పటిక రాయడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పటికలోని యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలు చర్మంపై ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తాయి. రాత్రి ముఖంపై పటిక పేస్ట్ రాయడం వల్ల మొటిమలు క్రమంగా తగ్గడం స్టార్ట్ అవుతాయి.

పటికలోని ఆస్ట్రిజెంట్ లక్షణాలు చర్మంపై పేరుకుపోయిన మురికి, నూనెలను తొలగిస్తుంది. పటికను రోజూ ముఖానికి రాయడం వల్ల చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి.

వేసవిలో చెమట, దుమ్ము తదితర సమస్యల కారణంగా చర్మంపై మచ్చలు వస్తుంటాయి. రోజూ రాత్రి వేళ పటికను రాయడం వల్ల పిగ్మెంటేషన్, మచ్చలు తొలగిపోతాయి.

రోజూ రాత్రి ముఖానానికి పటిక రాయడం వల్ల.. అందులోని ఔషధ గుణాలు చర్మాన్ని బిగుతుగా, యవ్వనంగా మార్చడంలో సాయపడతాయి.

పటికను పేస్ట్‌లా చేసి, అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాయాలి. 20 నుంచి 30 నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated at - Apr 23 , 2025 | 03:22 PM